- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
షారుక్, సల్మాన్ మల్టీ స్టారర్
బాలీవుడ్ దిగ్గజ హీరోలు షారుక్ ఖాన్, సల్మాన్ ఖాన్ ఇండస్ట్రీని ఏలేశారు. వరుస విజయాలతో దూసుకెళ్లారు. ఇప్పటికీ ఈ ఇద్దరికి బోలెడంత క్రేజ్, రెస్పెక్ట్ ఉన్నా… సినిమాలు మాత్రం అంతగా ఆడడం లేదు. కింగ్ ఆఫ్ రొమాన్స్ గా పేరు తెచ్చుకున్న షారుక్, కండల వీరుడు సల్మాన్ ఎన్ని ప్రయత్నాలు చేసినా బాక్సాఫీసు వద్ద సక్సెస్ కాలేకపోతున్నారు. దీంతో ఇద్దరు కలిసి ఓ నిర్ణయానికి వచ్చారట. ఎవరికి వారు సోలో హీరోగా విజయవంతం కాలేకపోతున్నాము కాబట్టి… మల్టి స్టారర్ మూవీతో బాక్సాఫీసు షేక్ చేద్దామని డిసైడ్ అయ్యారట. వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన కరణ్ అర్జున్ సినిమా సూపర్ డూపర్ హిట్ కాగా అదే సక్సెస్ ఫార్ములాతో ముందుకు వెళ్లాలని చూస్తున్నారు ఖాన్స్.
నిఖిల్ అద్వానీ దర్శకత్వంలో ఖాన్ ద్వయం భారీ మల్టీ స్టారర్ మూవీకి ప్లాన్ చేయగా… యశ్ రాజ్ ఫిల్మ్స్ బ్యానర్ సినిమాను నిర్మించనుందని సమాచారం. భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా గురించి మరింత సమాచారం తెలియాల్సి ఉండగా… ఖాన్స్ కాంబినేషన్ లో మూవీ వార్తతో ఫ్యాన్స్ ఖుష్ అవుతున్నారు.
Tags: Shahrukh Khan, Salman Khan, Bollywood,