- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మరో వారసుడొచ్చాడు!
దిశ, సెంట్రల్ డెస్క్: గత రెండు నెలల్లో కరోనాతో సమానంగా వార్తల్లో నిలుస్తున్న అంశం రిలయన్స్ జియో గురించే. వారానికొక భారీ ఒప్పందంతో తరచూ వార్తల్లో నిలుస్తున్న రిలయన్స్ జియో కంపెనీ మరో కీలక నిర్ణయం తీసుకుంది. రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేశ్ అంబానీ రెండో కుమారుడు అనంత్ అంబానీ జియో ప్లాట్‌ఫామ్‌లో అడిషనల్ డైరెక్టర్‌గా అడుగుపెట్టనున్నారు. రానున్న కొద్దిరోజుల్లో రిలయన్స్ సంస్థ అధికారిక ప్రకటన చేయనున్నట్టు తెలుస్తోన్నది. ఇప్పటికే అనంత్ సోదరుడు ఆకాశ్, సోదరి ఇషా డైరెక్టర్లుగా 2014 నుంచి బాధ్యతలను నిర్వహిస్తున్నారు. గతంలో ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్‌ల సమయంలో తల్లి నీతా అంబానీతో కలిసి ముంబై ఇండియన్స్‌ను అనంత్ ప్రోత్సహిస్తుండేవారు. ఇటీవల రిలయన్స్ ఇండస్ట్రీస్ వ్యవస్థాపకుడు ధీరుభాయ్ అంబానీ జన్మదినం సందర్భంగా అనంత్ కీలక ఉపన్యాసం చేశారు. ఆ సందర్భంలో రిలయన్స్ సంస్థలోని కుటుంబసభ్యులకు సేవ చేయడం తన లక్ష్యమని, భవిష్యత్తులో రాబోయే మార్పులకు ఇండియా నాయకత్వం వహించనుందని, ఆ మార్పులో రిలయన్స్ ముందుండాలని కోరుకుంటున్నట్టు చెప్పారు. అనంత్ అంబానీ నాయకుడిగా ఎదగడానికి జియో సరైన వేదికని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. అనంత్ తండ్రి ముఖేశ్ అంబానీ కూడా ఇదే వయసులో కుటుంబ వ్యాపారంలోకి ప్రవేశించారని కొందరు అభిప్రాయపడ్డారు.