- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఆ ఉత్తర్వులను సవాల్ చేయనున్న అంబానీ
దిశ, వెబ్‌డెస్క్: ముఖేశ్ అంబానీ, అనీల్ అంబానీ సహా మరికొందరిపై మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ రూ. 25 కోట్ల జరిమానా విధించిన సంగతి తెలిసిందే. 2000లో రియలన్స్ ఇండస్ట్రీస్(ఆర్ఐఎల్) టెకోవర్ నిబంధనలను పాటించడంలో నిబంధనలను ఉల్లంఘించిన కేసులు సెబీ ఈ జరిమానా విధించింది. ఆర్ఐఎల్ ప్రమోటర్లుగా ఉన్న వీరు కొందరితో కలిసి 5 శాతం వాటాలను స్వాధీనం చేసుకున్న వివరాలు ప్రకటించకపోవడం నేరంగా పరిగణించినట్టు పేర్కొంది. ఈ వ్యవహారానికి సంబంధించి రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ అధినేత ముఖేష్ అంబానీ సెక్యూరిటీ అప్పీలేట్ ట్రిబ్యునల్(ఎస్ఏటీ)లో సెబీ ఉత్తర్వులను సవాలు చేయనున్నట్టు తెలుస్తోంది.
ఆర్ఐఎల్ 1994లో కన్వర్టబుల్ వారెంట్‌లతో డిబెంచర్‌లను జారీ చేసింది. 2000లో వారెంట్‌లకు వ్యతిరేకంగా ఈక్విటీ షేర్లను కేటాయించింది. సెబీ 2011లో అప్పటి ప్రమోటర్, ప్రమోటర్ గ్రూప్ ఉల్లంఘన ఆరోపణలతో షోకాజ్ నేటీసులను జారీ చేసింది. ప్రమోటర్లు మైనారిటీ పెట్టుబడిదారుల చట్టబద్ధమైన హక్కులను నిరాకరించారని సెబీ వివరించింది. అయితే, టేకోవర్ నిబంధనలను ప్రమోటర్, ప్రమోటర్ గ్రూప్ సంస్థకు తెలియజేసిందని, అన్ని రకాలుగా చట్టాన్ని పాటించినట్టు ఆర్ఐఎల్ ఎక్స్ఛేంజ్ ఫైలింగ్‌లో పేర్కొంది. తాము చేసిన అప్పీల్‌కు ట్రెబ్యునల్‌లో ప్రాధాన్యత ఉంటుందని నమ్ముతున్నట్టు ఆర్ఐఎల్ వెల్లడించింది.