- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
సీఎం సహాయనిధికి ’ఎంఎస్‌ఎన్‘ రూ. 5 కోట్ల విరాళం
దిశ, హైదరాబాద్: ముఖ్యమంత్రి సహాయనిధికి ఎం.ఎస్.ఎన్ ఔషధ పరిశ్రమ అధినేత ఎమ్ఎస్ఎన్ రెడ్డి రూ. 5 కోట్ల విరాళం ప్రకటించారు. కంపెనీ అధినేత ఎంఎస్ఎన్‌రెడ్డితో పాటు మన్నే జీవన్ రెడ్డి, భరత్ రెడ్డిలు సీఎం కేసీఆర్ను కలిశారు. ఈ సందర్భంగా ఎమ్ఎస్ఎన్ రెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రం కరోనా వైరస్ రూపంలో విపత్కర పరిస్థితులను ఎదుర్కొంటున్న వేళ తమ వంతు సహకారాన్ని అందిస్తున్నామన్నారు. ఈ ఉద్దేశంతోనే ముఖ్యమంత్రి సహాయనిధికి ఐదు కోట్ల రూపాయలు విలువ గల.. వైద్యులు, సిబ్బందికి కావాల్సిన కరోనా రక్షణ కిట్లను (PPE kits) ఆందచేస్తునట్లు తెలిపారు. భవిష్యత్తులో ఔషధ పరమైన ఏలాంటి సహకారాన్ని అందించడానికి అయినా తాము, తమ సంస్థ సిద్ధంగా ఉంటుందని సీఎం కేసీఆర్‌తో ఎంఎస్ఎన్ రెడ్డి స్పష్టం చేశారు. కాగా, ఇప్పటికే మహబూబ్ నగర్ మరియు సంగారెడ్డి జిల్లాలో ఎంఎస్ఎన్ ఫౌండేషన్ తరఫున రూ. 50 లక్షల విలువైన శానిటైజర్, సబ్బులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ ఆ సంస్థ అధినేత ఎమ్‌ఎస్‌ఎన్‌రెడ్డి, మన్నే జీవన్ రెడ్డి, భరత్ రెడ్డిలను అభినందించారు.
tag: CM kcr, MSN Laboratories, MSN reddy, Manne Jeevan Reddy, Bharathi Reddy, donation, CM Aid Fund