ఎంఎస్సీ రేడియోలజీ పరీక్ష ఈ నెల 29న

by srinivas |
ఎంఎస్సీ రేడియోలజీ పరీక్ష ఈ నెల 29న
X

దిశ, తెలంగాణ బ్యూరో: పోస్ట్ ఎంఎస్సీ డిప్లామా ఇన్ రేడియాలజీ ఫిజిక్స్ ప్రవేశ పరీక్ష షెడ్యూల్ ఖరారైంది. ఈ నెల 29న ఉదయం 11గంటల నుంచి మధ్యాహ్నం 12.30 వరకు నిర్వహిస్తున్నట్టుగా కన్వీనర్ పాండురంగారెడ్డి ప్రకటించారు. విద్యార్థులు హాల్ టికెట్లను డౌన్ లోడ్ చేసుకోవల్సిందిగా సూచించారు. పరీక్షా కేంద్రానికి గంట ముందుగానే చేరుకోవాలని తెలిపారు. విద్యార్థులు తప్పనిసరిగా కొవిడ్ నిబంధనలు పాటించాలని, మాస్క్ లు ధరించి భౌతిక దూరం పాటించాలని తెలిపారు.

Advertisement

Next Story