- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన ఎంఎస్ ధోని నివాసం
X
దిశ, స్పోర్ట్స్: టీమ్ ఇండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్ అయ్యాక ఎక్కువ సమయం కుటుంబంతోనే గడుపుతున్నాడు. 20 ఏళ్లకు పైగా తీరిక లేని క్రికెట్ ఆడిన ధోని.. ప్రస్తుతం రాంచీలో ఒక ఇల్లు కట్టుకొని అక్కడే వ్యవసాయం చేస్తున్నాడు. ధోనికి పలు వ్యాపారాలు కూడా ఉన్నా.. ఇళ్లపై మక్కువ ఎక్కువ. ఇప్పటికే రాంచీతో పాటు ముంబై, పూణేలో ధోనికి సొంత ఇళ్లు ఉన్నాయి. తాజాగా మరో కొత్త ఇల్లు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ధోని ఇటీవల భార్య సాక్షి, కూతురు జీవాతో కలసి సిమ్లాకు వెళ్లాడు. అక్కడ వాళ్లు కొత్తగా కొనుగోలు చేసిన ఉడెన్ హౌస్‌లో సమయం గడుపుతున్నారు. దీనికి సంబంధించిన ఫొటోలో కూతురు జీవా ఇన్‌స్టాగ్రామ్‌లో అప్‌లోడ్ చేశారు. అందమైన ఉడెన్, గ్లాస్ హౌస్.. చుట్టూ కొండలతో అందరినీ ఆకట్టుకుంటున్నది. ధోనీ టేస్ట్ చూసి నెటిజన్లు ఫిదా అవుతున్నారు.
Advertisement
Next Story