- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
ఎస్సీ కార్పొరేషన్ లోన్స్ దరఖాస్తుల గడువు పొడిగించాలి
by Shyam |

X
దిశ, క్రైమ్ బ్యూరో : ఎస్సీ కార్పొరేషన్ రుణాల దరఖాస్తు గడువును ఫిబ్రవరి 22 వరకు పొడిగించాలని ఎమ్మార్పీఎస్ జాతీయ, రాష్ట్ర అధ్యక్షులు మేడి పాపయ్య మాదిగ, వంగపల్లి శ్రీనివాస్ మాదిగ కోరారు. మంత్రి కొప్పుల ఈశ్వర్‌ను సోమవారం కలిసి వినతిపత్రం అందజేశారు. ప్రభుత్వం ఎస్సీ కార్పొరేషన్ ద్వారా అందించే రుణాలకు రూ.10 లక్షల వరకు బ్యాంకులు, ష్యూరిటీతో సంబంధం లేకుండా మంజూరు చేయాలన్నారు. కరోనా, పండుగ సెలవుల కారణంగా చాలా మంది ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోలేకపోయారని తెలిపారు. బ్యాంకులతో సంబంధం లేకుండా రూ.10 లక్షల వరకు ప్రభుత్వమే నేరుగా రుణాలు అందించాలనే విషయాన్ని సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్తానని మంత్రి కొప్పుల ఈశ్వర్ హామీ ఇచ్చారు.
Next Story