- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
వాళ్లు భూములు లాక్కుంటే… ప్రతిపక్షాలు ఎందుకు?
దిశ, సూర్యాపేట: సూర్యాపేట జిల్లా కేంద్రంలో కలెక్టరేట్ ఎదుట గత నాలుగు రోజులుగా ఎస్సీ, ఎస్టీల అసైన్డ్ భూములు పరిరక్షణ కోసం దళిత సంఘాల ఆధ్వర్యంలో దీక్ష చేస్తున్న విషయం తెలిసిందే. శుక్రవారం దీక్షా శిబిరాన్ని మందకృష్ణ మాదిగ సందర్శించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ… రాష్ట్ర ప్రభుత్వం పేదల భూములు లాక్కుంటే, ప్రతిపక్ష పార్టీలు ఎందుకు స్పందించడం లేదో అర్ధం కావడం లేదని ప్రశ్నించారు.
దళితుల ఓట్లు కావాలి కానీ, వారి సమస్యలు పట్టవా అని విమర్శించారు. రైతు వేదిక, శ్మశాన వాటిక, నర్సరీ, వంటి ప్రభుత్వ కార్యాలయాల నిర్మాణాలకు గత ప్రభుత్వాలు పేదలకు ఇచ్చిన అసైన్డ్ భూములను బలవంతంగా లాక్కుంటుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయంలో ప్రధాన ప్రతిపక్ష కాంగ్రెస్, బీజేపీతో పాటు, దున్నేవాడిదే భూమి అని నినదించే వామపక్ష పార్టీలు సైతం మౌనం వహించడం వెనుక అంతర్యం ఏంటి అని ప్రశ్నించారు.