- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పార్లమెంట్ భవనంలోనే ఎంపీల రాసలీలలు
దిశ, వెబ్‌డెస్క్ : దేశ చట్టాలను రూపొందించే పవిత్రమైన పార్లమెంట్ భవనం రాసలీలలకు నిలయంగా మారింది. కొందరు ఎంపీలు, ప్రభుత్వ ఉద్యోగులు ఈ ఘన ‘కార్యానికి’ పాల్పడ్డారు. రాసలీలలకు సంబంధించిన వీడియోలు, ఫొటోలు సోమవారం రాత్రి బయటకు రావడం సంచలనంగా మారింది. ఈ ఘటనపై ప్రధాని ద్రిగ్భాంతి వ్యక్తం చేశారు.
ఆస్ట్రేలియా పార్లమెంట్ భవనంలోని ప్రేయర్ రూంలో కొంతమంది ఎంపీలతోపాటు నలుగురు ప్రభుత్వ ఉద్యోగులు లైంగిక కార్యక్రమాలకు తరుచూ వినియోగించుకున్నారు. వీటికి సంబంధించిన వీడియోలు, ఫొటోలను ఓ విజిల్ బ్లోయర్ బయట పట్టారు. వెంటనే అవ్వి ఆస్ట్రేలియా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. వెంటనే ఆసీస్ ప్రధాని స్కాట్ మోరిసన్ ఆ ఘటనను ఖండించారు. లైంగిక చర్యలకు పాల్పడిన అందరిపై కఠిన చర్యలు తీసుకుంటామని ప్రకటించారు. గంటల వ్యవధిలోనే కొంతమందిని విధుల నుంచి తొలగించారు.
Prime Minister Scott Morrison Breaks Down: Morrison has broken down while speaking about the parliament sex scandal revealed on 10 News last night #auspol pic.twitter.com/ZhMVDUa4zx
— 10 News First (@10NewsFirst) March 22, 2021
ఈ ఘటనపై ప్రధాని స్కాట్ మోరిసన్ మాట్లాడుతూ.. “ఈ రాత్రి ప్రసారమైన కథనాలు అసహ్యకరమైనవి, అనారోగ్యకరమైనవి. ఇవి ఎంతమాత్రం క్షమించలేని చర్యలు. ప్రజా పరిపాలన జరిగే పవిత్రమైన చోట, ఇలాంటివి జరగడం నిజంగా ఏమాత్రం ఆమోదయోగ్యం కాదు.” అని ప్రధాని పేర్కొన్నారు. వీటిపై వెంటనే స్పందించిన తన పరిపాలన విభాగం వీటికి పాల్పడిన ఉద్యోగులను విధులను నుంచి తొలిగించడం జరిగిందని పేర్కొన్నారు.