బిపిన్ రావత్ దంపతులకు ఎంపీ విజయసాయిరెడ్డి నివాళి

by srinivas |   ( Updated:2021-12-10 04:28:34.0  )
బిపిన్ రావత్ దంపతులకు ఎంపీ విజయసాయిరెడ్డి నివాళి
X

దిశ, ఏపీ బ్యూరో : తమిళనాడు కూనూర్‌ సమీపంలో చోటు చేసుకున్న హెలికాప్టర్‌ ప్రమాదంలో మరణించిన భారత తొలి సీడీఎస్‌ బిపిన్‌ రావత్‌ దంపతుల మృత దేహాలకు వైసీపీ పార్లమెంటరీ నేత విజయసాయిరెడ్డి, ఎంపీ వంగాగీతలు నివాళులర్పించారు. అనంతరం బిపిన్ రావత్ కుటుంబ సభ్యులను పరామర్శించారు.

తల్లిదండ్రులను కోల్పోవడంతో తీవ్ర దు:ఖంలో ఉన్న ఇద్దరు కుమార్తెలను పరామర్శించారు. ప్రమాదంలో మరణించిన బిపిన్ రావత్ దంపతులను శుక్రవారం ఢిల్లీలోని వారి నివాసానికి తరలించారు. ప్రజల సందర్శన కోసం రావత్‌ దంపతుల పార్థివదేహాలను కామరాజ్‌ మార్గ్‌ నివాసంలో ఉంచారు. రాజకీయ ప్రముఖులు రావత్ దంపతులకు నివాళులర్పిస్తున్నారు.

Advertisement

Next Story