ఎన్నికలంటే భయం కాదు : విజయసాయిరెడ్డి

by srinivas |
ఎన్నికలంటే భయం కాదు : విజయసాయిరెడ్డి
X

దిశ, వెబ్‌డెస్క్ : ఏపీలో స్థానిక ఎన్నికల నిర్వహణపై రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి స్పందించారు. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును తాము గౌరవిస్తున్నామని, ప్రజారోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని మాత్రమే ఎస్‌ఈసీ నిర్ణయాన్ని తాము వ్యతిరేకించామని చెప్పుకొచ్చారు.అంతేగానీ, ఎన్నికలంటే తమకేమీ భయం లేదని స్పష్టంచేశారు.

ఎవరైనా పంచాయతీ ఏకగ్రీవాలను విమర్శిస్తే అది ఖచ్చితంగా రాజకీయం చేసినట్లే అని అన్నారు.ఏకగ్రీవాలు ఎన్ని ఎక్కువైతే అంత మంచిదని.. దాని వలన గ్రామాల్లో ఫ్యాక్షనిజం, విభేధాలు ఉండవని వెల్లడించారు. దేశంలో అనేక రాష్ట్రాల్లో ఏకగ్రీవాలు జరుగుతున్నాయని, ఇదేమీ కొత్త కాదని సర్దిచెప్పే ప్రయత్నం చేశారు. ఇదిలాఉండగా, ఏకగ్రీవాలను జనసేన పార్టీ ఆది నుంచి వ్యతిరేకిస్తున్న విషయం తెలిసిందే.

Advertisement

Next Story