- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కాంగ్రెస్ నాయకత్వాన్ని కొన్న కేసీఆర్ : రేవంత్ రెడ్డి
దిశ, తెలంగాణ బ్యూరో : కాంగ్రెస్ నాయకత్వాన్ని సీఎం కేసీఆర్ కొనుగోలు చేశారని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు సీఎం కేసీఆర్ ఇప్పుడు పెడబొబ్బలు పెడుతున్నారని, కాంగ్రెస్ ఎంపీలు, ఎమ్మెల్యేలు లాక్కొని కాంగ్రెస్‌ను బలహీనం చేయాలని చూశారన్నారు. గాంధీభవన్‌లో ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు. తెలంగాణ మైదానంలో ఏ రాజకీయ పార్టీ లేకుండా చేయాలని సీఎం కేసీఆర్ కుట్ర చేశారని, కేసీఆర్ అరాచకంగా పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించారని, ప్రజలకు రాజకీయాలను అసహ్యం కలిగేలా చేశారన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ నాయకత్వాన్ని కొనుగోలు చేసినా ప్రజల్లో కాంగ్రెస్ బలహీనపడలేదని సీఎంపై ఫైర్ అయ్యారు. బీజేపీ, ఎంఐఎం పార్టీలు మతవిద్వేషాలు రెచ్చగొట్టడం ద్వారా తెలంగాణ ప్రమాదంలో పడిందని, మత విద్వేషాలకు కేసీఆర్ బాధ్యత వహించాలన్నారు.
గ్రేటర్ ఎన్నికల్లో మతం అంశంతో ఓట్ల కోసం రెండు పార్టీలు ప్రయత్నాలు చేస్తున్నాయని, ఎంఐఎం, బీజేపీ మధ్య చీకటి ఒప్పందం ఉందని రేవంత్‌రెడ్డి విమర్శించారు. గ్రేటర్ ఎన్నికల్లో హైదరాబాద్ వరదలపై చర్చ జరగకుండా టీఆర్‌ఎస్, బీజేపీ, ఎంఐఎం కుమ్మక్కు రాజకీయాలు చేశాయని, కాంగ్రెస్‌కు రావాల్సిన ఓట్లను చీల్చి ఎంఐఎం గెలిచేందుకు బీజేపీ సహకరిస్తోందని, సచివాలయంలో మసీదును కూల్చితే ఎంఐఎం ఏం చేసిందని ప్రశ్నించారు. అమిత్‌షా మాటల్లో రాజకీయ దురాలోచన కనిపిస్తోందని, బీజేపీకి రెండు సార్లు అధికారమిస్తే హైదరాబాద్‌కు ఏం చేశారని, కేంద్రం చేయలేని పని కార్పొరేటర్ చేస్తాడా అని రేవంత్‌రెడ్డి ప్రశ్నించారు.
గులాబీ చీడను వదిలించుకోవాలి..
తెలంగాణ రాష్ట్రాన్ని ఏడేళ్లుగా టీఆర్‌ఎస్ నేతలు దోచుకున్నారని, ఇంకా సరిపోలేదని టీఆర్‌ఎస్ నాయకులు మిడత దండువలె జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో ప్రజలపై పడి దోచుకునేందుకు వచ్చారని దుయ్యబట్టారు. అవినీతి గులాబీ దండును తరిమికొట్టి నగరానికి పట్టిన గులాబీ చీడను వదిలించాలని పిలుపునిచ్చారు. 2016 జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ ఇచ్చిన హామీలు నెరవేర్చినట్లయితే సీఎం కేసీఆర్ ఫామ్‌హౌస్‌లో పడుకుంటే టీఆర్‌ఎస్ గెలవాలి కదా అని, మరి ఎందుకు ఎంపీలు, మంత్రులు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, సర్పంచ్‌లు నగరంపై మిడతల దండువలె దండెత్తి ప్రచారం చేయాల్సి వస్తోందని ప్రశ్నించారు.
గతంలో ఇచ్చిన హామీలు అమలు చేయలేదు కాబట్టే కేసీఆర్‌కు భయం పట్టుకుందని, నగరానికి రూ. 67 వేల కోట్లు ఖర్చుపెట్టామని చెబుతున్న టీఆర్‌ఎస్ ప్రభుత్వం ఆ నిధులు ఎవరి జేబులకు పోయాయో చెప్పాలని రేవంత్‌రెడ్డి డిమాండ్ చేశారు. తెలంగాణలో జరుగుతున్న ఒక మునిసిపాలిటీ ఎన్నికలకు బీజేపీలోని ప్రధాని మోడీ, కేంద్ర హోమ్ శాఖ మంత్రి అమిత్ షా, యూపీ సీఎం యోగి ఆదిత్య కేంద్ర మంత్రులు, జాతీయ నాయకులు వచ్చి ప్రచారం చేయడం ఏమిటని, వీళ్ళందరు మొన్న వరదలు వచ్చి హైదరాబాద్ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతుంటే ఎందుకు రాలేదని రేవంత్‌రెడ్డి ప్రశ్నించారు.