మా జిల్లా జోలికి రాకండి..

by srinivas |
మా జిల్లా జోలికి రాకండి..
X

దిశ, విశాఖపట్నం: ఏపీలో కొత్త జిల్లాలు ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం ప్రయత్నం చేస్తున్న విషయం తెలిసిందే. అయితే తాజాగా దీనిపై శ్రీకాకులం టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు స్పందించారు. జిల్లాల విభజన విషయంలో మా శ్రీకాకులం జిల్లాని కలపొద్దని కోరారు. జిల్లాల విభజన జరిగితే తామేం నష్టపోతామో వివరిస్తూ.. ఒక వీడియో విడుదల చేశారు. శ్రీకాకుళం జిల్లాను విభజిస్తానంటే అంగీకరించలేనని ఆయన అన్నారు. 25 పార్లమెంట్‌లకు 25 జిల్లాలు చేస్తామనే ఆలోచన అసంబద్ధ ఆలోచన అని రామ్మోహన్ నాయుడు అన్నారు.

అవసరం ఉన్న చోట మాత్రమే కొత్త జిల్లాల ఏర్పాటు చేయాలని ఆయన సూచించారు. ఒకవేళ శ్రీకాకుళం జిల్లా విభజన జరిగితే దాని ఉనికి, ఉపాధికి కూడా కష్టమే అని అన్నారు. అంతేగాకుండా 2026లో పునర్విభజనతో పార్లమెంటు స్థానాలు పెరిగితే అప్పుడు ఏం చేస్తారు? అని ప్రశ్నించారు. రాజకీయ కారణాలతో చేస్తున్న ఈ కొత్త జిల్లాల ఏర్పాటుకు తాము వ్యతిరేకమని స్పష్టం చేశారు. కొత్త జిల్లాల ఏర్పాటుకు సంబంధించి అన్ని రకాల ఫైల్స్‌ను చకచకగా నడపుతూ భవనాలను సైతం గుర్తించడం విశేషం.

Advertisement

Next Story

Most Viewed