- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఎంపీ కోమటిరెడ్డి లేఖ
దిశ, వెబ్‌డెస్క్: ముఖ్యమంత్రి కేసీఆర్‌కు కాంగ్రెస్ కీలక నేత, భువనగిరి పార్లమెంట్ సభ్యులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి లేఖ రాశారు. కరోనా విస్తృతంగా వ్యాప్తిచెందుతున్న ప్రస్తుత విపత్కర పరిస్థితుల్లో ప్రాణాలకు తెగించి ప్రజలకు వార్తను చేరవేస్తున్న జర్నలిస్టులను ఫ్రంట్‌లైన్ వారియర్లుగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఇప్పటివరకూ తెలంగాణలో 100 మంది జర్నలిస్టులు కరోనాకు బలైయ్యారని అన్నారు. ఇతర రాష్ట్రాలు జర్నలిస్టులకు ప్రత్యేకంగా ఉచిత వైద్యం అందిస్తున్నాయని గుర్తుచేశారు.
‘‘సిద్దిపేట జిల్లాకు చెందిన సీనియర్ జర్నలిస్టు చెలుకుల వెంకట్ రెడ్డి కరోనాతో మృతిచెందడం చాలా బాధాకరం. చావు దుఃఖంలో ఉన్న వారి కుటుంబానికి తక్షణమే తెలంగాణ ముఖ్యమంత్రి కార్యాలయం రూ.25 లక్షల ఆర్ధిక సహాయం చేయాలి. నిత్యం ప్రజల కోసం పని చేసే జర్నలిస్టులను మనం కాపాడుకోవాల్సిన అవసరం వుంది.’’ అని కోరారు. అంతేగాకుండా.. కరోనా బారినపడిన జర్నలిస్టులకు ప్రత్యేకంగా బెడ్లు కేటాయించి ప్రైవేట్ ఆస్పత్రిలో ఉచిత వైద్యం అందించేలా ప్రభుత్వం కృషి చేయాలని డిమాండ్ చేశారు.
తెలంగాణ ప్రభుత్వం తక్షణమే జర్నలిస్టులను "frontline warriors " గా గుర్తించాలి . వారికి ప్రత్యేకంగా బెడ్లు కేటాయించి ప్రైవేట్ hospitals లో ఉచిత వైద్యం ప్రభుత్వం చేయించాలి. కరోనాతో జర్నలిస్టులు చనిపోతే వారి కుటుంబానికి 25 లక్షల ఆర్ధిక సహాయం చేయాలని కేసిఆర్ కి విజ్ఞప్తి చేస్తున్నాను.
— Komatireddy Venkat Reddy (@KomatireddyKVR) May 10, 2021