- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
తెలంగాణ కాంగ్రెస్ పార్టీపై కోమటిరెడ్డి సంచలన కామెంట్స్
దిశ, వెబ్‌డెస్క్: కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డిని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఆదివారం కలిశారు. భువనగిరిలో పర్యాటక అభివృద్ధి అంశాలపై కిషన్ రెడ్డితో చర్చించినట్టు కోమటిరెడ్డి తెలిపారు. అంతకముందు పర్యాటక మంత్రిగా బాధ్యతలు చేపట్టిన కిషన్ రెడ్డిని కోమటిరెడ్డి వెంకటరెడ్డి అభినందించారు. తెలుగు వారికి, దేశానికి పేరు తెచ్చేలా పనిచేయాలని కిషన్ రెడ్డిని ఈ సందర్భంగా కోరారు. అనంతరం ఈ సందర్భంగా కోమటిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ… తెలంగాణలో పర్యాటక ప్రాంతాల అభివృద్ధిపైన కిషన్ రెడ్డితో చర్చించానని తెలిపారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని నడిపించే సమర్థవంతమైన నాయకుడు లేడు అని సంచలన వ్యాఖ్యలు చేశారు. చివరివరకూ కాంగ్రెస్ పార్టీలోనే ఉంటానని.. పార్టీ మారే ఆలోచన లేదని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రజాప్రతినిధులు రాజకీయాలు వదిలేసి అభివృద్ధిపై దృష్టి సారించాలని కోరారు.