జాతీయ రహదారుల విస్తరణకు నిధులు మంజూరు : ఎంపీ కోమటిరెడ్డి

by Shyam |
MP Komatireddy Venkat Reddy
X

దిశ, భువనగిరి: జాతీయ రహదారుల విస్తరణకు కేంద్రప్రభుత్వం నిధులు మంజూరు చేసినట్లు భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తెలిపారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. న‌కిరేక‌ల్ – నాగార్జునసాగ‌ర్‌ జాతీయ రహదారి(565) కోసం రూ. 390 కోట్లు, హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారి(65) నుంచి ఎల్బీ నగర్ అందోల్ మైస‌మ్మ వరకున్న ఆరులైన్ల రోడ్డును 8 లైన్లుగా మార్చేందుకు రూ.600 కోట్లు మంజూరు అయినట్లు ఆయన వెల్లడించారు. నిధులు మంజూరు కావడంతో రెండు జాతీయ రహదారులు అందుబాటులోకి రానున్నాయని చెప్పారు. త‌న ప‌రిధిలో పూర్తైన‌ రెండు జాతీయ ర‌హ‌దారుల‌ను కేంద్ర రోడ్డు ర‌వాణా, జాతీయ ర‌హా‌దారుల శాఖ మంత్రి నితిన్ గ‌డ్కరీతో క‌లిసి కోమ‌టిరెడ్డి వెంక‌ట్ రెడ్డి వ‌ర్చువ‌ల్ విధానంలో హైద‌రాబాద్‌లోని నేషనల్ హైవే అథారిటీ రీజనల్ కార్యాలయం నుంచి ప్రారంభించినట్లు తెలిపారు. ఈ సంద‌ర్భంగా ఎంపీ కోమ‌టిరెడ్డి వెంక‌ట రెడ్డి మాట్లాడుతూ.. త‌ను చేసిన కృషికి ఇప్పటికే రెండు జాతీయ ర‌హ‌దారుల విస్తర‌ణ ప‌నులు పూర్తయి నేటి నుంచి ప్రజ‌ల‌కు అందుబాటులోకి వ‌చ్చిన‌ట్లు వివ‌రించారు. అలాగే ప‌లుమార్లు కేంద్ర మంత్రిని క‌లిసి ప‌దేప‌దే విన్నవించగా మ‌రో రెండు జాతీయ రహ‌దారుల ప‌నులకు నిధులు మంజూరైన‌ట్లు ప్రకటించారు.

పూర్తైన ర‌హదారుల్లో జాతీయ ర‌హ‌దారి నెంబ‌ర్ 365లో న‌కిరేక‌ల్ నుంచి తానంచెర్ల వ‌ర‌కు మొత్తం 66.563 కిలోమీట‌ర్ల రోడ్డు ప‌నులు రూ. 605.08 కోట్లతో పూర్తి చేసి ప్రారంభించిన‌ట్లు తెలిపారు. అలాగే జాతీయ ర‌హ‌దారి 163లో యాదాద్రి నుంచి వ‌రంగ‌ల్ వ‌ర‌కు 99.103 కిలో మీట‌ర్ల రోడ్డును రూ. 1889.72 కోట్లతో పూర్తిచేసి నేడు ప్రజ‌ల‌కు అందుబా‌టులోకి తీసుకువ‌చ్చిన‌ట్లు వివ‌రించారు. ప‌లుమార్లు క‌లిసి న‌కిరేక‌ల్ నుంచి నాగార్జునసాగ‌ర్ వ‌ర‌కు జాతీయ ర‌హ‌దారి విస్తర‌ణ చేప‌ట్టాల‌ని కోరిన‌ట్లు తెలిపారు. మ‌రో ప్రాజెక్టు హైదరాబాద్ నుంచి విజయవాడ 65 జాతీయ రహదారి ఎల్‌బీన‌గ‌ర్ నుంచి ఆందోల్ మైసమ్మ(గుడిమల్కాపూర్) వ‌ర‌కు ఆరులైన్లుగా ఉన్న జాతీయ రహదారిని 8 లైన్లుగా మార్చాల‌ని విన్నవించిన‌ట్లు తెలిపారు. దీంతో నేడు న‌కిరేక‌ల్ – నాగార్జున సాగ‌ర్ ప్రాజెక్టుకు రూ. 390 కోట్లు, ఎల్‌బీన‌గ‌ర్ – అందోల్ మైస‌మ్మ ప్రాజెక్టుకు రూ. 600 కోట్లను కేంద్ర మంత్రి నితిన్ గ‌డ్కరీ కేటాయించిన‌ట్లు తెలిపారు. ఈ కార్యక్ర మంలో నేషనల్ హైవే రీజనల్ సీజీఎమ్ కృష్ణ ప్రసాద్ పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed