ప్రజలను ఇబ్బంది పెడితే ఊరుకోం : ఎంపీ కోమటిరెడ్డి

by Shyam |
ప్రజలను ఇబ్బంది పెడితే ఊరుకోం : ఎంపీ కోమటిరెడ్డి
X

దిశ, తెలంగాణ బ్యూరో : సీఎం కేసీఆర్‌ ఒళ్లు దగ్గర పెట్టుకొని రాష్ట్రాన్ని పాలించాలని, ప్రజలను ఇబ్బందులు పెడుతే చూస్తూ ఉరుకొమని, గడీల పాలనను బద్దలు కొడుతామని కాంగ్రెస్​ నేత, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి మండిపడ్డారు. ఇకనైనా పిచ్చి తుగ్లక్ పాలనకు స్వస్తి పలకాలని పిలుపునిచ్చారు. బుధవారం ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. ఎల్‌ఆర్‌ఎస్‌పైన ప్రజల పక్షాన కోర్టులో ఫీల్ దాఖలు చేశానని, ఎల్‌ఆర్‌ఎస్‌ రద్దు కోసం న్యాయ పోరాటం చేస్తున్నామని, ఎల్‌ఆర్‌ఎస్‌ రద్దు చేసే వరకు కాంగ్రెస్​ పార్టీ పోరాటం చేస్తుందని తెలిపారు. ఇప్పుడు ఎల్‌ఆర్‌ఎస్‌ లేకుండా రిజిస్ట్రేషన్లు చేయడం కాదు శాశ్వతంగా రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. ప్రజల దగ్గర ఎల్‌ఆర్‌ఎస్‌ పేరుతో డబ్బులు వసూలు చేయడం కేసీఆర్‌ సిగ్గు అనిపించడం లేదా? అని మండిపడ్డారు. శ్వాశతంగా ఎల్‌ఆర్‌ఎస్‌ను రద్దు చెయాలి లేకపోతే కేసీఆర్‌, టీఆర్ఎస్‌ను శాశ్వంతంగా ప్రజలు రద్దు చేస్తారని అన్నారు.

భవిష్యత్తులో ఎవరు ఎల్‌ఆర్‌ఎస్‌ కట్టవద్దని, రానున్న రోజుల్లో ఉద్యమాలు, పోరాటాలతో టీఆర్ఎస్ ప్రభుత్వాని ఉక్కిరిబిక్కిరి చేస్తామన్నారు. సీఎం కేసీఆర్ పాలనను అంతమొందిస్తామని, కేసీఆర్ నిర్ణయలు చూస్తే పిచ్చి తుగ్లక్ ఉంటే పిచ్చి తుగ్లక్‌కే పిచ్చి వచ్చేదని మండిపడ్డారు. కొత్త రిజిస్ట్రేషన్లు అని దాన్ని వెనక్కి తీసుకొని మళ్లీ పాత పద్ధతిలోనే రిజిస్ట్రేషన్‌లు చేస్తున్నారని, మూడు నెలలు రిజిస్ట్రేషన్ల్ అపేసి ప్రజలను ఇబ్బంది పెట్టారని విరుచుకుపడ్డారు. నియంత్రిత వ్యవసాయం అని మళ్లీ రద్దు చేశారని, కేసీఆర్‌ నిర్ణయలను చూసి ప్రజలు చిత్కరించుకుంటున్నారని ఫైర్​ అయ్యారు. బుర్ర దగ్గర పెట్టుకొని నిర్ణయాలు తీసుకోవాలని హితవు పలికారు. గ్రాడ్యుయేషన్ ఎమ్మెల్సీ ఎన్నికలు ఉన్న నేపథ్యంలోనే ఉద్యోగులపైన ప్రేమ పుట్టుకచ్చిందా? అని సూటిగా ప్రశ్నించారు. సీఎం కేసీఆర్‌కు చిత్తశుద్ధి ఉంటే ఎమ్మెల్సీ ఎన్నికలలోపే ఉద్యోగులకు వేతనాల పెంపు, వయో పరిమితి పెంపు, ఖాళీగా ఉన్న పోస్టులు భర్తీ చేయాలని వెంకట్​రెడ్డి డిమాండ్‌ చేశారు.

నిరుద్యోగ భృతి ఇవ్వాలి..

పీఆర్సీ కోసం ఎన్నిసార్లు కమిటీలు వేస్తారని, ఇక కేసీఆర్‌ అబద్దాలకు స్వస్తి పలకాలన్నారు. రైతులకు ఉచిత ఎరువులు అని రైతులకు శుభవార్త వారం రోజుల్లో చెబుతానన్నది ఏం అయిందని ప్రశ్నించారు. సకల జనులను ఏకం చేసి తెలంగాణ కోసం చేసిన ఉద్యమం కంటేని పెద్ద ఉద్యమం చేస్తామని కేసీఆర్ నియంత పాలనకు చరమగితం పాడుతామని, కేసీఆర్‌ను గద్దెదించుతామని ఎంపీ కోమటిరెడ్డి ప్రకటనలో తెలిపారు.

Advertisement

Next Story