మూసీ ప్రక్షాళనకు చొరవ చూపండి

by Shamantha N |
మూసీ ప్రక్షాళనకు చొరవ చూపండి
X

తెలంగాణలోని మూసీ నది ప్రక్షాళనకు చొరవ చూపాలని భువనగిరి ఎంపీ కొమటిరెడ్డి వెంకటరెడ్డి బుధవారం ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడిని కలిశారు. నమామి గంగా ప్రాజెక్టు తరహాలో మూసీ నదిని శుభ్రం చేయించాలని,అందుకు రాష్ట్ర ప్రభుత్వంతో చర్చలు జరపాలని ఎంపీ విజ్ఞప్తి చేశారు. ఫార్మా కంపెనీల వ్యర్థాలు, డ్రైనేజీ నీరంతా మూసి నదిలో కలువడంతో దాని ఉనికి ప్రశ్నార్ధకంగా మారిందన్నారు. దీంతో మూసి పరివాహక ప్రాంతాల్లో భూగర్భ జలాలు కలుషితమవుతున్నాయని తెలిపారు.300 నుంచి 500 ఫీట్ల లోతు వరకు మూసి భూమిలో ఇంకిపోవడం వలన బోరు వాటర్ అవుతోందని, ఆ ప్రాంతంలో పండిన పంటలు తినడం వల్ల ప్రజలు అనారోగ్యాల బారిన పడుతున్నారని వివరించారు.కలుషిత నీరు తాగి పశువులు మరణిస్తున్నాయని గుర్తుచేశారు.17వ లోక్‌సభలో రూల్ 377 కింద ప్రత్యేక ప్రస్తావనగా”జీరో అవర్” లోని మొదటి సెషన్‌లోనూ, రెండవ సెషన్‌లోనూ తాను ఈ సమస్య లేవనెత్తినప్పటికీ, కాలుష్యాన్ని అరికట్టడానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని అభ్యర్థించారు.దీనిపై కేంద్రం నుంచి స్పందన కరువైందని ఎంపీ ఆవేదన వ్యక్తం చేశారు. మూసి ప్రక్షాళనపై కేంద్ర, రాష్ట ప్రభుత్వాలకు ఆదేశాలు జారీ చేయాలని కోరారు.ట్రిట్మెంట్ ప్లాంట్ల ఏర్పాటు, విరివిగా చెట్ల పెంపకం, పరిశ్రమ వ్యర్థాల కట్టడి ద్వారా మూసిని పరిరక్షించాలని కోరారు. స్పందించిన ఉపరాష్ట్రపతి జలవనరుల శాఖా మంత్రి‌తో మాట్లాడి సమస్యను పరిష్కరించాలని ఆదేశించినట్టు తెలుస్తోంది.

Advertisement

Next Story

Most Viewed