యువజన కాంగ్రెస్ నేతలకు ఎంపీ కోమటిరెడ్డి కీలక సూచన

by Shyam |   ( Updated:2021-08-09 07:47:49.0  )
MP Komatireddy venkat reddy
X

దిశ, హాలియా: యువజన కాంగ్రెస్ నాయకులు ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాడాలని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పిలుపునిచ్చారు. సోమవారం జాతీయ యువజన కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా నల్గొండ జిల్లా యువజన కాంగ్రెస్ నాయకులు ఎంపీ కోమటిరెడ్డిని కలిశారు. ఈ సందర్భంగా కోమటిరెడ్డి మాట్లాడుతూ… యువజన నాయకులు కాంగ్రెస్ పార్టీకి ఆయువు పట్టు అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై వారు చేస్తున్న పోరాటం అభినందనీయం అని కొనియాడారు. జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షులు రాజా రమేష్ చేస్తున్న కార్యక్రమాల విధివిధానాలు యువతకు స్ఫూర్తి దాయకం అన్నారు. ఈ కార్యక్రమంలో నల్గొండ నియోజకవర్గ అధ్యక్షులు పుట్టా రాకేష్, నాగార్జున సాగర్ నియోజకవర్గ అధ్యక్షులు పగడాల నాగరాజు, సతీష్ గౌడ్, రావుల శ్రీనివాస్, కమతం జగదీష్ రెడ్డి, కిలారి మురళి, బత్తుల తిరుపతి, వినయ్, యాదయ్య, మహేష్, వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story