- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- వీడియోలు
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- OTT Release
రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించాలి: కోమటిరెడ్డి
దిశ, నల్లగొండ: రాష్ట్రంలో పాలన గాడి తప్పిందని, ప్రభుత్వం మీద ప్రజలకు నమ్మకం పోయిందని భువనగిరి ఎంపీ కోమటి రెడ్డి అన్నారు. కమీషన్లు దండుకోవడం తప్ప ప్రజల ఆరోగ్యంపై కేసీఆర్‌కు శ్రద్ధ లేదని విమర్శించారు. ఉస్మానియా ఆస్పత్రిలోకి నీళ్లు వచ్చాయంటే ప్రభుత్వ పనితీరు ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చన్నారు. వెంటనే కేసీఆర్ ఉస్మానియా హాస్పిటల్‌ను సందర్శించాలని, కరోనాను ఆరోగ్య శ్రీలో చేర్చాలని ఆయన డిమాండ్ చేశారు. కరోనాతో ప్రజలు చనిపోతుంటే కేసీఆర్‌కు కనబడడం లేదా అని ప్రశ్నించారు. కరోనా మందులు, ఆక్సిజన్ సిలెండర్లు బ్లాక్‌లో అమ్ముతుంటే చర్యలు తీసుకోవడం లేదని ఆరోపించారు. ప్రజల ఆరోగ్యాలను కేసీఆర్ గాలికి వదిలేశారని, కరోనాపై సీఎం అసలు సమీక్ష నిర్వహించడం లేదని దుయ్యబట్టారు. ఇలాంటి సమయంలో సచివాలయ నిర్మాణంపై సమీక్ష నిర్వహించడం విడ్డూరంగా ఉందన్నారు. ఈ సమయంలో వెయ్యి కోట్లతో కొత్త సచివాలయ నిర్మాణం అవసరమా అని ప్రశ్నించారు. దేశంలో ఇంత దుర్మార్గమైన పాలన ఏ రాష్ట్రంలో కూడా లేదన్నారు. రాష్ట్రంలో హెల్త్ ఎమర్జెన్సీ నెలకొందని, రాష్ట్రపతి పాలనను విధించాలని డిమాండ్ చేశారు. త్వరలోనే కాంగ్రెస్ ఎంపీలందరం రాష్ట్రపతిని కలుస్తామని కోమటిరెడ్డి వెల్లడించారు.