ఢిల్లీలోనే బండి సంజయ్..

by Anukaran |   ( Updated:2020-07-30 05:10:00.0  )
ఢిల్లీలోనే బండి సంజయ్..
X

దిశ, వెబ్ డెస్క్ :
తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ గత మూడురోజులుగా ఢిల్లీలోనే మకాం వేశారు. రాష్ట్ర కమిటీ కూర్పు పై ఆయన బీజేపీ అగ్రనాయకత్వంతో సంప్రదింపులు జరుపుతున్నారు. నూతన కమిటీ ఎంపిక పై రాష్ట్ర నేతలతో బండి సంజయ్ చేసిన చర్చలు కొలిక్కి రాలేదు. దీంతో ఆయన హస్తిన బాట పట్టినట్లు తెలుస్తోంది. జీహెచ్‌ఎంసీ ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ అధికార టీఆర్‌ఎస్‌ను ఎదుర్కొవాలంటే సొంత పార్టీలో విబేధాలు ఉండకూడదు. నేపథ్యంలోనే చర్చలు కొలిక్కి తెచ్చేలా బండి సంజయ్ ఢిల్లీలో పావులు కదుపుతున్నట్లు సమాచారం.

Advertisement

Next Story

Most Viewed