- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- OTT Release
థియేటర్స్‌లో రిలీజ్‌కు సిద్ధం..
దిశ, వెబ్‌డెస్క్: బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే, ఇషాన్ ఖట్టర్ జంటగా నటించిన ‘కాలీ పీలీ’ సినిమా సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుంది. అక్టోబర్ 2న జీ ప్లెక్స్‌లో రిలీజ్ అయిన ఈ సినిమా బెంగళూరు, గుర్గావ్‌లోని ‘డ్రైవ్ ఇన్ థియేటర్స్’లోనూ అదే రోజు విడుదలై ప్రేక్షకులకు మంచి ఫన్ రైడ్ అందించింది. అయితే అక్టోబర్ 15 నుంచి సినిమా హాల్స్, థియేటర్స్ ఓపెన్ చేసుకోవచ్చని కేంద్ర ప్రభుత్వం అనుమతించడంతో ఈ సినిమా నిర్మాతలు థియేటర్‌లో రిలీజ్ చేసేందుకు నిర్ణయించారు. అక్టోబర్ 16న ‘కాలీ పీలీ’ సినిమా థియేటర్స్‌లో రిలీజ్ కానున్నట్లు ప్రకటించారు.
ఇక ఇప్పటికే జీ ప్లెక్స్‌లో రిలీజ్ అయిన తమిళ్ ఫిల్మ్ ‘కా పే రణసింగం’ సినిమాను కూడా అక్టోబరు 16న థియేటర్స్‌లో రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించింది మూవీ యూనిట్. సమాజంలో మార్పు తీసుకువచ్చే కోణంలో సాగే ఈ సినిమాలో విజయ్ సేతుపతి, ఐశ్వర్య రాజేష్ హీరో హీరోయిన్లుగా నటించారు. పి. విరుమాండి డైరెక్షన్‌లో వచ్చిన సినిమాను కోటపడి జే రాజేష్ నిర్మించారు.
భారత ప్రధాని నరేంద్ర మోదీ జీవితకథ ఆధారంగా తెరకెక్కిన “పీఎం నరేంద్ర మోడీ” సినిమాను రీ రిలీజ్ చేయనుంది మూవీ యూనిట్. కరోనా తర్వాత థియేటర్స్‌లో రిలీజ్ అవుతున్న చిత్రం ఇదే కాగా.. 2019 ఎన్నికలకు ముందు విడుదల కావాల్సిన ఈ సినిమా ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున ఎన్నికల ఫలితాల అనంతరం విడుదలైంది. దీంతో మళ్లీ ఈ సినిమాను రిలీజ్ చేసేందుకు నిర్ణయించారు. వివేక్ ఒబెరాయ్ మోదీ పాత్రలో కనిపించగా.. ఓమంగ్ కుమార్ సినిమా దర్శకులు.