శివరాత్రి కదా హనుమాన్ OTTలో రిలీజ్ చేస్తారా.. జీ5 ఆన్సర్‌కు ఫ్యాన్స్ షాక్!

by Jakkula Samataha |
శివరాత్రి కదా హనుమాన్ OTTలో రిలీజ్ చేస్తారా.. జీ5 ఆన్సర్‌కు ఫ్యాన్స్ షాక్!
X

దిశ, సినిమా : తెలుగు ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్న సినిమా హనుమాన్.ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తేజ సజ్జా నటించిన ఈ సినిమా సంక్రాంతి సందర్భంగా జనవరి 12న రిలీజై బ్లాక్ బస్టర్ హిట్ అందుకోవడమే కాకుండా, అత్యధిక వసూళ్లు సాధించి, హిస్టరీ క్రియేట్ చేసింది.

ఇక అప్పటి నుంచి ఈ మూవీ ఎప్పుడెప్పుడు ఓటీటీలో వస్తుందా అని ఎదురు చూడగా, ఈ సినిమా డిజిటల్ హక్కులను జీ5 కొనుగోలు చేసింది. భారీ ధరకు హనుమాన్ మూవీని కొనుగోలు చేసి ఈ ఓటీటీ ఫ్లాట్ ఫామ్ మార్చి1న మూవీని స్ట్రీమింగ్ చేస్తుందని అందరూ భావించారు. కానీ ఇప్పటికీ హనుమాన్ మూవీ ఓటీటీలోకి రాలేదు. దీంతో ఫ్యాన్స్ అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇక మహాశివరాత్రి సందర్భంగా హనుమాన్ మూవీ ఓటీటీలోకి వస్తుందని ఫ్యాన్స్ ఎదురు చూడగా, నేడు కూడా వారికి నిరాశే మిగిలింది.

ఈ క్రమంలోనే హనుమాన్ మూవీ రిలీజ్‌పై జీ5ను ప్రశ్నించిన ఓ నెటిజన్‌కు సంస్థ బిగ్ షాక్ ఇచ్చింది. దయచేసి ఈరోజు హనుమాన్ మూవీని ఓటీటీలో రిలీజ్ చేయండి.ఎందుకంటే నేడు మహాశివరాత్రి కదా అంటూ ఓ యూజర్ జీ5కి మెసేజ్ చేశారు. దీంతో అతని ప్రశ్నకు స్పందించిన సంస్థ..హాయ్ మాకు ఇంకా హనుమాన్ ఓటీటీ రిలీజ్‌పై ఎలాంటి అప్డేట్ రాలేదు. మా వెబ్ సైట్‌ను తరచుగా చూస్తూ ఉండండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా సోషల్ హ్యాండిల్స్ ఫాలో అవ్వండంటూ జవాబు ఇచ్చింది. దీంతో హనుమాన్ మూవీ ఓటీటీలో చూడాలనుకున్న వారికి ఇక నిరాశే మిగిలింది. ఇప్పట్లో ఈ సినిమా ఓటీటీలోకి వచ్చేలా లేదంటూ ఫ్యాన్స్ అసహనం వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed