యంగ్ హీరో Kiran Abbavaram ‘రూల్స్ రంజన్’ సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్..

by Hamsa |   ( Updated:2023-09-04 14:40:12.0  )
యంగ్ హీరో Kiran Abbavaram ‘రూల్స్ రంజన్’ సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్..
X

దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం, డీజే టిల్లు హీరోయిన్ నేహా శెట్టి జంటగా నటిస్తున్న తాజా చిత్రం ‘రూల్స్ రంజన్’. ఈ చిత్రానికి రత్నం కృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు. సుప్రసిద్ధ నిర్మాత ఏ.ఎం. రత్నం సమర్పణలో స్టార్ లైట్ ఎంటర్టైన్మెంట్ పతాకంపై దివ్యాంగ్ లవానియా, మురళి కృష్ణ వేమూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రింకు కుక్రెజ సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.

అమ్రీష్ గణేష్ సంగీతం అందిస్తుండటం విశేషం. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన అప్డేట్స్ సినిమాపై భారీ అంచనాలు పెంచేశాయి. తాజాగా, రూల్స్ రంజన్ రిలీజ్ డేట్‌ను కిరణ్ అబ్బవరం తన ఇన్‌స్టాగ్రామ్ వేదికగా షేర్ చేశాడు. సెప్టెంబర్ 28న ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాను విడుదల చేయనున్నట్లు తెలిపాడు. అంతేకాకుండా ఓ పోస్టర్‌ను కూడా వదిలాడు. అందులో క్లాస్ లుక్‌లో నేహా, కిరణ్ ఆకట్టుకున్నారు.

‘Jawan’లో దీపిక ఎపిసోడ్‌కు స్పెషల్ అప్లాజ్.. బొమ్మ బ్లాక్ బస్టర్..

Advertisement

Next Story