- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Mehreen Pirzada: వాటిని ప్రమోట్ చేస్తున్న యంగ్ బ్యూటీ.. అవి డ్యామేజ్ కావంటూ ఇంట్రెస్టింగ్ పోస్ట్
దిశ, సినిమా: నేచురల్ స్టార్ నాని నటించిన ‘కృష్ణగాడి వీర ప్రేమ గాధ’ మూవీతో పరిచయం అయిన యంగ్ హీరోయిన్ మెహ్రీన్ పిర్జాదా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తర్వాత పలు సినిమాల్లో నటించి మంచి గుర్తింపు సంపాదించుకున్నది. అలా కెరీర్ బిగినింగ్‌లో వరుస సినిమాలతో దూసుకుపోయిన ఈ బ్యూటీకి మాత్రం అనుకున్నంత స్టార్‌డమ్ అయితే రాలేదని చెప్పుకోవాలి. కానీ ఆమె చేసిన పాత్రల పేర్లు కూడా గుర్తుండిపోయేలా నటించింది ఈ భామ. ఇక కెరీర్ పీక్స్‌లో ఉన్నప్పుడే ఎంగేజ్మెంట్ చేసుకుని ఫ్యాన్స్‌కు షాక్ ఇచ్చింది. తర్వాత కొద్ది గ్యాప్‌లోనే నిశ్చితార్థం బ్రేక్ చేసుకుంటున్నట్లు ప్రకటించింది. అనంతరం పూర్తిగా చిక్కిపోయి కనబడింది. ఇప్పుడిప్పుడే మళ్లీ కాస్త బెటర్‌గా కనిపిస్తున్న మెహ్రీన్ నిత్యం సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉంటూ తన వ్యక్తిగత విషయాలను, ఫొటోలను షేర్ చేస్తు అభిమానులకు దగ్గరవుతూ ఉంటుంది.
ఇదిలా ఉంటే తాజాగా ఈ ముద్దుగుమ్మ హెయిర్ డ్రయర్‌ను ప్రమోట్ చేస్తూ ఫొటోలకి పోజులిచ్చింది. అంతే కాకుండా డైసన్ ఫ్రెండ్ మళ్లీ వచ్చిందోచ్.. ఇది జుట్టు స్ట్రైట్‌గా ఉండటానికి సహాయపడుతుంది. దీనిని మనం తడి, పొడి జుట్టు మీద ఉపయోగించవచ్చు. ఇలా ఉపయోగించడం వల్ల ఎటువంటి జుట్టు నష్టం ఉండదు. అలాగే మీ హెయిర్ కూడా డ్యామేజ్ అవ్వదు. సమయం కూడా చాలా ఆదా అవుతుందంటూ క్యాప్షన్ జోడించింది. అది చూసిన నెటిజన్లు రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
Read more...
(video link credits to mehreen pirzada instagram id)