Yash: గ్రాండ్‌గా స్టార్టైనా య‌శ్‌ ‘టాక్సిక్’

by sudharani |
Yash: గ్రాండ్‌గా స్టార్టైనా య‌శ్‌ ‘టాక్సిక్’
X

దిశ, సినిమా: ‘KGF’తో పాన్ ఇండియా రేంజ్‌లో గుర్తింపు తెచ్చుకున్న రాక్ స్టార్ యష్.. ప్రజెంట్ నిర్మాతగా మారి వరుస సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా ఉన్నాడు. ఈ క్రమంలోనే యష్ ప్రజెంట్ నటిస్తున్న పాన్ ఇండియా భారీ బ‌డ్జెట్ మూవీ ‘టాక్సిక్: ఎ ఫెయిరీ టేల్ ఫ‌ర్ గ్రోన్ అప్స్‌’. గీతూ మోహన్ దాస్ దర్శకత్వం వహించనున్న ఈ చిత్ర షూటింగ్ ఈ రోజు (గురువారం) పూజా కార్యక్రమాలతో గ్రాండ్‌గా స్టార్ట్ చేశారు. సంప్రదాయానికి అనుగుణంగా నటుడు, నిర్మాత యశ్, నిర్మాత వెంకట్ కె.నారాయణ, వారి కుటుంబ సభ్యులతో కలిసి సినిమా విజయం సాధించాలని దేవుడి ఆశీస్సులు కోరారు. పూజా కార్యక్రమాల్లో చిత్ర యూనిట్‌తో పాటు పలువురు ప్రముఖులు కూడా హాజరై చిత్ర యూనిట్‌కు అభినందన‌లు తెలిపారు. ప్రజెంట్ ఇందుకు సంబంధించిన ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

Advertisement

Next Story