పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చిన హీరోయిన్ యామీ గౌతమ్.. భలే పేరు పెట్టిందిగా..

by Sujitha Rachapalli |   ( Updated:2024-05-20 06:55:38.0  )
పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చిన హీరోయిన్ యామీ గౌతమ్.. భలే పేరు పెట్టిందిగా..
X

దిశ, సినిమా: బ్యూటీఫుల్ యామీ గౌతమ్ తెలుగులో చేసిన ప్రాజెక్టులు కలిసి రాకపోయినా ప్రేక్షకులకు మాత్రం దగ్గరైంది. బాలీవుడ్ లో ఆమె ఎంచుకున్న ప్రాజెక్టులు సూపర్ క్లిక్ అవడం, బ్యాక్ టు బ్యాక్ సక్సెస్ కావడంతో స్టార్ హీరోయిన్ అయిపోయింది. రీసెంట్ గా ఆర్టికల్ 370తో హిట్ అందుకుంది యామీ. ప్రస్తుతం పలు ప్రాజెక్ట్స్ కూడా కమిట్ అయినట్లు తెలుస్తోంది.

ఇక ఈ విషయాలను పక్కన పెడితే యామీ డైరెక్టర్ ఆదిత్య ధర్ ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. ' Uri: The Surgical Strike ' టైంలో దర్శకుడితో ప్రేమలో పడిన ఆ సినిమా హీరోయిన్ యామీ.. కరోనా టైంలో ఇంటిమేట్ సెరమనిలో పెళ్లి చేసుకుంది. సక్సెస్ ఫుల్ గా అటు ఫ్యామిలీ లైఫ్ ఇటు ప్రొఫెషనల్ లైఫ్ బ్యాలెన్స్ చేస్తుంది. ఇక తాజాగా ఈ భామ అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పింది. తనకి కొడుకు పెట్టాడని, 'VEDVID' గా పిలిచుకుంటున్నామని తెలుపుతూ పోస్ట్ పెట్టింది. దీంతో ఆమెకు శుభాకాంక్షలు తెలుపుతున్న అభిమానులు.. బేబీ బాయ్ కు ఆశీర్వచనాలు అందిస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed