- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
వారి కారణంగానే చిరంజీవిపై సీరియస్ అయ్యా.. చిన్ని కృష్ణ వీడియో వైరల్
దిశ, సినిమా: రచయిత చిన్ని కృష్ణ అందరికీ తెలిసుండే ఉండుంది. మెగా స్టార్ చిరంజీవికి ‘ఇంద్ర’ వంటి బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చిన చిన్ని కృష్ణ.. ఒకానొక సందర్భంలో చిరంజీవి గురించి తప్పుగా మాట్లాడారు. అప్పట్లో ఆ న్యూస్ సెన్సేషనల్ అయింది. అయితే.. తాజాగా మెగా స్టార్ చిరంజీవికి పద్మభూషణ్ అవార్డు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఆయన్ని కలిసిన శుభాకాంక్షలు తెలిపిన రచయిత చిన్ని కృష్ణ సోషల్ మీడియా వేదికగా ఎమోషనల్ వీడియో రిలీజ్ చేశారు.
ఆయన మాట్లాడుతూ.. ‘పద్మభూషణ్ వచ్చిన చిరంజీవి అన్నయ్యకు శుభాకాంక్షలు చెప్పడం కోసం ఈరోజు ఆయన్ని కలిశాను. జీవితంలో ప్రతి ఒక్కరు తప్పు చేస్తారు.. తప్పుగా మాట్లాడతారు అనేది నగ్న సత్యం. 45 ఏళ్లు ఉన్న నేనే.. నన్ను నమ్మి నాకు ‘ఇంద్ర’ సినిమా అవకాశం ఇచ్చిన చిరంజీవిని.. ఒక బ్యాడ్ టైంలో కొంతమంది వ్యక్తుల కారణంగా నేను ఆయన్ని తిట్టడం జరిగింది. దీనికి సమాజంతో పాటు నా ఫ్యామిలీ కూడా నన్ను వ్యతికేఖించింది. ఆ క్షణం నుంచి మీతో మాట్లాడే ఈ క్షణం వరకు కూడా నేను చాలా మదన పడ్డాను. ఎన్నో సార్లు భగవంతుని ముందు, స్నేహితుల ముందు క్షమాపణలు చెప్పాను. ఆ తర్వాత ఎప్పుడు అన్నయ్యకు (చిరంజీవిని) ఎదరుపడటం జరగలేదు. పద్మభూషణ్ అవార్డు వచ్చిన తర్వాత ఆయనను కలవడానికి వెళ్తే.. నన్ను రిసీవ్ చేసుకున్న విధానం.. నాతో మాట్లాడిన తీరు, నా బాగోగులు, నా ఫ్యామిలీ బాగోగులు అడిగి తెలుసుకున్నారు. అలాంటి మహనీయుడినా నేను నా నోటితో తిట్టింది అనుకుని క్షమించమని అడిగాను. పెద్ద మనసుతో క్షమించడమే కాకుండా.. ఎంతో ఆప్యాయతగా దగ్గరకు తీసుకుని కథలు ఏమన్న రాస్తున్నావా చిన్ని అడిగారు. అన్నయ్య ఈ నోటీతో ఇంకోసారి ఎవరిని తప్పుగా మాట్లాడను. మరోసారి మిమ్మల్ని క్షమించమని అడుగుతున్నాను. కలిసి పని చేద్దాం ఏమన్న కథలు ఉంటే చెప్పమన్నారు. ఈసారి మీతో చేయబోయేది, మీకు రాయబోయేది ఈ భారతదేశం గుర్తుపెట్టుకోవాలని.. ఇంకా ఎన్నో అవార్డులు భారత ప్రభుత్వం నుంచి మీరు తీసుకోవాలని కోరుకుంటున్నారు. వచ్చే జన్మంటూ ఉంటే మీ తోబుట్టువుగా పుట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ.. నన్ను క్షమించు అన్నయ్య’ అంటూ చెప్పుకొచ్చారు. అయితే.. ఎవరి కారణంగా చిరంజీవిపై చిన్ని కృష్ణ దుర్భాషలాడారు అనేది చెప్పలేదు.