వావ్ వాట్ ఎ పిక్చర్.. పోలింగ్ బూత్ వద్ద అభిమాని గుండెలపై ఎన్టీఆర్ సంతకం..

by Kavitha |   ( Updated:2024-05-13 07:35:35.0  )
వావ్ వాట్ ఎ పిక్చర్.. పోలింగ్ బూత్ వద్ద అభిమాని గుండెలపై ఎన్టీఆర్ సంతకం..
X

దిశ, సినిమా: యంగ్ టైగర్ ఎన్టీఆర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఎన్టీఆర్ ప్రస్తుతం ‘దేవర’ సినిమాతో బిజీగా ఉన్నాడు. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తుంది. ఇక దీంతో పాటు బాలీవుడ్ మూవీ ‘వార్ 2’లో హృతిక్ రోషన్, ఎన్టీఆర్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రాన్ని.. యశ్ రాజ్ ఫిలిమ్స్ బ్యానర్‌లో బాలీవుడ్ డైరెక్టర్ అయాన్ ముఖర్జీ తెరకెక్కిస్తున్నాడు.

ఇక ఇప్పటికే ఈ సినిమా ఫస్ట్ షెడ్యూల్ కూడా కంప్లీట్ చేయగా.. రీసెంట్‌గా సెకండ్ షెడ్యూల్‌లో భాగంగా ఆదివారం రాత్రి వరకు ఎన్టీఆర్ ముంబైలో ఉన్నారు. అయితే యంగ్ టైగర్ ఎన్టీఆర్ బాధ్యత గల పౌరుడుగా ప్రతి ఎన్నికల్లో తప్పనిసరిగా ఓటు వేయడం ఆయనకు అలవాటు.

తాజాగా జూబ్లీహిల్స్‌లోని ఓబుల్ రెడ్డి స్కూల్‌లోని పోలింగ్ కేంద్రంలో జూనియర్ ఎన్టీఆర్, తన భార్య ప్రణీత, తల్లి షాలిని తో కలిసి వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అయితే ఓ అభిమాని ఈ రోజు ఉదయం పోలింగ్ బూత్ వద్దకు చేరుకొని ఎన్టీఆర్ ఓటు వేసి వచ్చిన అనంతరం... ''అన్నా! ఆటోగ్రాఫ్'' అంటూ ఆయన వద్దకు వెళ్లాడు. అప్పుడు అభిమాని గుండెలపై ఎన్టీఆర్ ఆటోగ్రాఫ్ చేశారు. గుండెలపై అంటే గుండెలపై కాదండోయ్ షర్ట్ మీద హార్ట్ ఉండే ప్లేసులో సంతకం చేశారు యంగ్ టైగర్. ప్రస్తుతం ఈ ఫోటో వైరల్‌గా మారింది.


Advertisement

Next Story

Most Viewed