'BRO' ఈవెంట్‌లో Pawan Kalyan ధరించిన వాచ్‌ ధర తెలిస్తే షాక్ అవ్వాల్సిందే?

by Prasanna |   ( Updated:2023-07-27 05:19:44.0  )
BRO ఈవెంట్‌లో Pawan Kalyan ధరించిన వాచ్‌ ధర తెలిస్తే షాక్ అవ్వాల్సిందే?
X

దిశ, వెబ్ డెస్క్: ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో 'బ్రో' ఫీవర్‌ నడుస్తోంది. పవర్‌ స్టార్‌ పవన్‌ కల్యాణ్‌, సుప్రీం హీరో సాయి ధరమ్‌ తేజ్‌ నటించిన మల్టీ స్టారర్‌ సినిమా జూలై 28 న ప్రేక్షకుల ముందుకు రానుంది. 'బ్రో' సినిమాకు సముద్రఖని దర్శకత్వం చేశారు. దీంతో సోషల్ మీడియాలో బ్రో సినిమామకు సంబంధించిన పోస్టర్లు తెగ వైరల్ అవుతున్నాయి. ఈ మూవీ ప్రి రీలీజ్ ఫంక్షన్ జూలై 25 న శిల్పకళా వేదికలో జరిగింది. ఈ ఈవెంటుకు సాయి ధరమ్ తేజ్‌, వరుణ్‌ తేజ్‌, కేతికా శర్మ, ప్రియా ప్రకాష్, సముద్రఖని, బ్రహ్మానందం తదితర నటినటులు హాజరయ్యారు.

ప్రతి ఈవెంటులో మాట్లాడినట్టే ఈ ఈవెంటులో కూడా పవన్ కళ్యాణ్ స్పీచ్ తో అదరగొట్టేశారు. అయితే ఈ ఫంక్షన్‌లో పవన్ కల్యాణ్‌ పెట్టుకున్న వాచ్ పైన అందరీ కళ్లు పడ్డాయి. దీంతో ఆ వాచ్ ధర తెలుసుకోవడానికి నెటిజన్లు తెగ ఆరా తీశారు. బ్రో ఈవెంట్లో పవన్ కల్యాణ్‌ ధరించిన వాచ్‌ బ్రెగ్యుట్‌ మైరెన్‌ క్రోనోగ్రాఫ్‌. ఇది ప్రపంచంలో అత్యంత ఖరీదైన వాచుల్లో ఒకటి. దీని ధర సుమారు రూ. 21,45,678 లని తెలుస్తోంది. ఈ ధర తెలుసుకున్ననెటిజెన్స్ పవన్ అంటే ఆ మాత్రం రేంజ్ ఉండాలంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Also Read: Niharikaతో విడాకుల తర్వాత Chaitanya న్యూ పోస్ట్.. నీ జీవితం బాగుపడింది అంటున్న నెటిజన్లు

Advertisement

Next Story