- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
యూట్యూబ్‌ను షేక్ చేస్తున్న 'Varisu' ట్రైలర్..
దిశ, సినిమా: దళపతి విజయ్ హీరోగా, సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ వంశీ పైడిపల్లి దర్శకత్వంలో వస్తున్న చిత్రం 'వరిసు'. ఈ చిత్రాన్ని తెలుగు, తమిళంలో సంక్రాంతి కానుకగా జనవరి 12న గ్రాండ్ రిలీజ్ చేస్తున్నారు మేకర్స్. దిల్ రాజు నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ మూవీ నుంచి ఇప్పటివరకు విడుదలైన ప్రతి సాంగ్, లుక్‌కి మంచి స్పందన వచ్చింది. ఇక అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఈ మూవీ థియేట్రికల్ ట్రైలర్‌ని బుధవారం విడుదల చేసింది మూవీ యూనిట్. దీనికి మాసివ్ రెస్పాన్స్ వస్తోంది. మామూలుగా విజయ్ సినిమా పోస్టర్లకు కానీ, వీడియోలకు కానీ సోషల్ మీడియాలో ఎలాంటి స్పందన వస్తుందో తెలిసిందే. ఇక ఇప్పుడు ఈ ట్రైలర్ విడుదలైన 13 గంటల్లో ఏకంగా సుమారు 20 మిలియన్ యూట్యూబ్ వ్యూస్ నమోదు అయ్యాయి. మొత్తానికి ట్రైలర్ చూస్తుంటే ఫ్యామిలీ డ్రామా, యాక్షన్, ఎమోషనల్, ఎంటర్ టైన్ మెంట్ ఇలా అన్నీ ఎలిమెంట్స్‌తో సంక్రాంతి పండుగకు గొప్ప అనుభూతినిచ్చే సినిమా లాగా కనిపిస్తుంది 'వారసుడు'.
- Tags
- Varisu