డబుల్‌ ఇస్మార్ట్ మూవీతో రామ్‌ కెరీర్‌ మారుతుందా.. ఫ్లాప్ ల నుంచి బయట పడతాడా ?

by Prasanna |
డబుల్‌ ఇస్మార్ట్ మూవీతో  రామ్‌ కెరీర్‌ మారుతుందా.. ఫ్లాప్ ల నుంచి బయట పడతాడా ?
X

దిశ, సినిమా : డబుల్ స్మార్ట్ రిజల్ట్ మీద పూరీ జగన్నాథ్ కెరీర్ ఎంత ఆధారపడి ఉంటుందో తెలియదు కానీ రామ్ కి మాత్రం ఈ సినిమా విజయం చాలా ముఖ్యం. డబుల్ ఇస్మార్ట్ తర్వాత, రామ్ తీయబోయే రెండు ప్రాజెక్ట్‌లు వైరల్ అవుతున్నాయి. ఇస్మార్ట్ శంకర్‌ మూవీ తర్వాత రామ్ కెరీర్‌లో చెప్పుకోదగ్గ విజయమేమీ లేదు.

రామ్, పూరీ హిట్ కాంబో మనకి తెలిసిందే.. అందుకే మళ్లీ అదే ఫార్ములాను నమ్మారు. లైగర్ తో కోలుకోలేని దెబ్బ తిన్న పూరీ జగన్నాథ్.. ధైర్యంతో ముందుకు అడుగులు వేస్తూ.. డబుల్ ఇస్మార్ట్ మూవీని తెరకెక్కిస్తున్నాడు. మొదటి అనుకున్న ప్లాన్ వర్క్ అవుట్ అయి ఉంటే ఈ టైం కి సినిమా విడుదలయి ఉండేది. ఇప్పుడు మళ్లీ షూటింగ్ మొదలైంది. రామ్ ఇటీవల ముంబైలో తన షెడ్యూల్‌ను పూర్తి చేశాడు. ఇటీవల విడుదలై స్కంథ మూవీ నిరాశపరిచిన తర్వాత డబుల్ ఇస్మార్ట్ పై రామ్ నమ్మకం పెట్టుకున్నాడు.

డబుల్ ఇస్మార్ట్ రిలీజ్ తర్వాత రామ్ ఏం చేస్తాడనేది ఎప్పటికప్పుడు చర్చనీయాంశమైంది. గౌతమ్ వాసుదేవ మీనన్‌తో ఓ సినిమా ఉందనే వార్తలు వచ్చాయి. మిస్‌ శెట్టి మిస్టర్‌ పొలిశెట్టి డైరక్టర్‌ తాజాగా రామ్‌కి ఓ కథ వినిపించారని టాక్ బాగా నడుస్తుంది. కానీ, ఏది ఏమైనా సరే డబుల్ ఇస్మార్ట్ మూవీ రిజల్ట్ తెలిసే వరకు రామ్ సైలెంట్ గానే ఉంటారని సినీ వర్గాలు చెబుతున్నాయి.

Advertisement

Next Story

Most Viewed