ఇతరుల శరీరంతో వ్యాపారం చేసిన వ్యక్తి నా దుస్తులపై మాట్లాడతాడా.. శిల్పాశెట్టి భర్తకు ఉర్ఫీ కౌంటర్

by Hamsa |   ( Updated:2023-10-07 07:36:50.0  )
ఇతరుల శరీరంతో వ్యాపారం చేసిన వ్యక్తి నా దుస్తులపై మాట్లాడతాడా.. శిల్పాశెట్టి భర్తకు ఉర్ఫీ కౌంటర్
X

దిశ, వెబ్‌డెస్క్: బిగ్‌బాస్ బ్యూటీ ఉర్ఫీ జావెద్ తన వెరైటీ దుస్తులతో నెట్టింట రచ్చ చేస్తుంటుంది. సినిమాల కంటే తన డ్రెస్సులతోనే పాపులారిటీ దక్కించుకుంది. ప్రతి రోజు ఏదో ఒక వెరైటీ దుస్తులతో వివాదాలతో వార్తల్లో నిలుస్తూ ఉంటుంది. తన వేషధారణ గురించి ఎవరైనా మాట్లాడితే వారికి గట్టిగా సమాధానం చెప్తుంది. అయితే ఇటీవల శిల్పాశెట్టి భర్త రాజ్ కుంద్రా ఓ వీడియోలో ఉర్ఫీ జావెద్ గురించి మాట్లాడారు. దీనికి సంబంధించిన వీడియోను తన సోషల్ మీడియాలో కూడా షేర్ చేశాడు. అందులో.. రాజ్ కుంద్రా ఏం ధరిస్తాడు.. అలాగే ఉర్ఫీ జావెద్ ఏం ధరించదు? అనే విషయాన్ని మీడియా ఎక్కువగా ఫోకస్ చేస్తుంది అని చెప్పుకొచ్చాడు. తాజాగా, దీనిని చూసిన ఉర్ఫీ జావెద్, రాజ్ కుంద్రాపై ఫైర్ అవుతూ ఇన్‌స్టాస్టోరీలో ఓ పోస్ట్ షేర్ చేసింది. ‘‘ ఇతరుల శరీరంతో వ్యాపారం చేసిన వ్యక్తి.. ఇప్పుడు నా దుస్తులపై మాట్లాడుతాడా.. క్షమించండి పోర్న్ కింగ్’’ అంటూ ఘాటుగా స్పందించింది.



Advertisement

Next Story