ఈ ముహూర్తంలోనే వరుణ్- లావణ్యల పెళ్లి ఎందుకు ఫిక్స్ చేసారంటే..?

by Prasanna |   ( Updated:2023-11-01 05:37:36.0  )
ఈ ముహూర్తంలోనే వరుణ్- లావణ్యల పెళ్లి ఎందుకు ఫిక్స్ చేసారంటే..?
X

దిశ,వెబ్ డెస్క్: ఇటలీలో మెగా పెళ్లి సందడికి సమయం ఆసన్నమైంది. మరి కొద్దీ గంటల్లో కొణిదెల వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠితో ఏడు అడుగులు వేయబోతున్నారు. ఇరు కుటుంబాల సమక్షంలో నేడు డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకోబోతున్నారు. ఇప్పటికే మెగా-అల్లు కుటుంబాలు ఇటలీలో సందడీ చేస్తుండగా.. కాక్‌టెయిల్ పార్టీతో వెడ్డింగ్ వేడుకలు గ్రాండ్​గా ప్రారంభమయ్యాయి. హల్దీ, మెహందీ వేడుకలు ఘనంగా జరిగాయి. మెగా ఫ్యామిలీతో పాటు లావణ్య త్రిపాఠి కుటుంబాలకు చెందిన స్నేహితులు వంద మందికి పైగా అతిథులు పెళ్లికి హాజరుకానున్నారని తెలుస్తోంది. ఇక వీరి పెళ్లి ముహూర్తం ఈ రోజు మధ్యాహ్నం 2:48కి ఖరారు చేశారు. ఆ సమయంలో లావణ్య మెడలో వరుణ్‌ తాళి కట్టనున్నారు. ఆ సమయం నుంచి వారిద్దరు భార్య భర్తలు కానున్నారు. చాలా మందికి ఒక చిన్న సందేహం ఉంది.. అ సమయంలోనే వరుణ్, లావణ్య ల ఎందుకు ఫిక్స్ చేసారని..? వాస్తవానికి నాగబాబు ఒకటికి, రెండు సార్లు వీరిద్దరి జాతకాలు చూపించారట.అయితే వీళ్ల జాతకాల ప్రకారం ఈ సమయాన్ని పురోహితులు నిశ్చయించారట.. ఈ సమయంలో వీరు ఒక్కటైతే ఎలాంటి గొడవలు లేకుండా.. జీవితాంతం సంతోషంగా ఉంటారని చెప్పారట, అందుకే ఈ సమయాన్ని ఫైనల్‌ చేసినట్లు తెలుస్తోంది.

Advertisement

Next Story