- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
Malavika Mohanan: నా పెళ్ళికి మీకెందుకు తొందర.. గట్టిగా ఇచ్చి పడేసిన తంగలాన్ బ్యూటీ..
దిశ, సినిమా: డబ్బింగ్ మూవీస్ ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన యంగ్ బ్యూటీ మాళవిక మోహనన్ గురించి స్పెషల్‌గా చెప్పాల్సిన పని లేదు. మలయాళం సినిమాలతో కెరీర్ మొదలు పెట్టిన ఈ ముద్దుగుమ్మ.. ‘పేట’ మూవీతో టాలీవుడ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది. ప్రస్తుతం ఈ అమ్మడు విక్రమ్ హీరోగా నటిస్తున్న ‘తంగలాన్’ అనే మూవీతో ప్రేక్షకులను అలరించడానికి రెడీ అవుతుంది. ఈ సినిమాలో డీ గ్లామర్ రోల్ పాత్రలో నటిస్తుంది ఈ బ్యూటీ. కాగా ఈ చిత్రం ఆగస్టు 15న థియేటర్లలోకి రానుంది. అయితే ఈ మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా మాళవిక పలు ఇంటర్వ్యూలలో పాల్గొంటున్నది.
ఈ క్రమంలో తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న మాళవిక కొన్ని ఆసక్తికర విషయాలను పంచుకుంది. అందులో భాగంగా పెళ్లెప్పుడు అని యాంకర్ అడిగిన ప్రశ్నకు దిమ్మతిరిగే సమాధానం ఇచ్చింది. “నా పెళ్లి చూడాలనే తొందర ఎందుకు.? అంటూ కౌంటర్ ఇచ్చింది. ఇక సినిమా గురించి మాట్లాడుతూ.. తంగలాన్ సినిమా అదిరిపోతుందని.. అలాగే హీరో విక్రమ్ అందరితో చాలా ఫ్రెండ్లీగా మూవ్ అవతారని తెలిపింది. అయితే ‘తంగలాన్’ కోసం నేను మొదటిసారి స్టంట్స్ చేశా. దానికి విక్రమ్ చాలా సాయం చేశారు. నటన విషయంలో సహ నటులకు విక్రమ్ ఎంతో సాయం చేస్తాడు అంటూ మాళవిక మోహనన్ చెప్పుకొచ్చింది.
కాగా ఈ అమ్మడు పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, మారుతి కాంబోలో తెరకెక్కుతున్న ‘రాజా సాబ్’ మూవీలో కూడా నటిస్తోంది. ఇక ఇప్పటికే ఈ సినిమా గ్లింప్స్ రిలీజ్ అయ్యి ప్రేక్షకులను ఆకట్టుకుంది.