OTT Movie: ఓటీటీలోకి వచ్చేసిన హారర్ కామెడీ ‘ముంజ్యా’.. ఎక్కడ స్ట్రీమ్ అవుతుందంటే?

by Prasanna |   ( Updated:2024-08-26 14:05:52.0  )
OTT Movie: ఓటీటీలోకి వచ్చేసిన హారర్ కామెడీ ‘ముంజ్యా’.. ఎక్కడ స్ట్రీమ్ అవుతుందంటే?
X

దిశ, వెబ్ డెస్క్: టాలీవుడ్, బాలీవుడ్, హాలీవుడ్ ఇలా అన్ని సినిమాల వారు ఓటీటీలనే నమ్ముకుంటున్నారు. కరోనా ముందు వరకు ఏ మాత్రం కూడా ట్రెండ్ సెట్ చేయని ఓటీటీ ఆ తర్వాత నుంచి మొత్తం ఏలేస్తుంది. భారీ బడ్జెట్ తో తీసిన సినిమాలు కూడా నేరుగా డిజిటల్ ఫ్లాట్ ఫామ్ లోకి వచ్చేస్తున్నాయి. ఇలా సినీ నిర్మాతలు, ఓటీటీ సంస్థలు రెండు లాభపడుతున్నాయి.

నిర్మాత దినేష్ విజన్ యూనివర్స్ లో వచ్చిన సూపర్ హిట్ హర్రర్ కామెడీ ‘ముంజ్యా’. ఈ మూవీలో బాలీవుడ్ భామ శర్వరీ, అభయ్ వర్మ కీలక పాత్రలో నటించిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్స్ వర్షం కురిపించింది. మొత్తం రూ.100 కోట్లను రాబట్టి సూపర్ హిట్ గా నిలిచింది. ఆడియెన్స్ తో పాటు సినీ విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఇక ఈ మూవీ ఓటీటీ రిలీజ్ కోసం వేచి చూస్తున్న వారికి మేకర్స్ శుభవార్త చెప్పారు.

తాజాగా ‘ముంజ్యా’ సినిమా ఓటీటీలోకి వచ్చేసింది. ఆగస్టు 25 నుంచి డిస్నీ+హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. థియేటర్స్ లో చూడని వారు ఓటీటీలో చూడవచ్చు. ఈ మూవీకి ఆదిత్య సర్పోత్దార్ దర్శకత్వం వ‌హించాడు. దీనిలో నటించిన హీరో హీరోయిన్లు శర్వరీ, అభయ్ వర్మ వారి నటనతో ప్రశంసలు అందుకున్నారు.

Advertisement

Next Story

Most Viewed