Sai Pallavi: ఏంటి! ఇంత నాచురల్‌గా కనిపించే సాయి పల్లవి ఆ మేకప్ ప్రొడక్ట్స్ లేకుండా బయటికి రాదా.. అవేంటంటే?

by Kavitha |   ( Updated:2024-08-03 06:26:32.0  )
Sai Pallavi: ఏంటి! ఇంత నాచురల్‌గా కనిపించే సాయి పల్లవి ఆ మేకప్ ప్రొడక్ట్స్ లేకుండా బయటికి రాదా.. అవేంటంటే?
X

దిశ, సినిమా: నేచురల్ బ్యూటీ సాయి పల్లవి గురించి స్పెషల్‌గా చెప్పాల్సిన అవసరం లేదు. తన అందం, అభినయంతో అందరినీ ఆకట్టుకుంది. ‘ప్రేమమ్’ మూవీతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ.. తన ఫస్ట్ మూవీతోనే మంచి ఫేమ్ తెచ్చుకుంది. ముఖ్యంగా సినిమాల్లో కండిషన్స్ పెట్టుకొని నటించడం, ఎక్కువ రొమాంటిక్ సీన్స్‌ను ప్రాధాన్యత ఇవ్వకపోవడంతో ఈమెపై మరింత అభిమానం పెరిగిపోయింది. ప్రస్తుతం ఈ అమ్మడు బాలీవుడ్ హీరో రణబీర్ కపూర్ సరసన ‘రామాయణం’ అనే మూవీతో పాటు నాగ చైతన్య సరసన ‘తండేల్’, అలాగే యష్ సరసన ఓ మూవీలో నటిస్తూ బిజీ బిజీగా ఉన్నది. అయితే ఈ సహజ సుందరి అందరు హీరోయిన్లలా ముఖానికి పెయింట్, పెదాలకు లిప్ స్టిక్ వేసుకుని, పొట్టి డ్రస్సులు వేసుకోని గ్లామరస్‌గా కనిపించకుండా చాలా సింపుల్‌గా ఉంటుంది అనే విషయం అందరికీ తెలిసిందే.. అవసరం అయితే తప్ప మేకప్‌ను ముఖం మీదకు రానివ్వదు. అలాంటి ఈ బ్యూటీ మాత్రం కచ్చితంగా ఈ రెండు ప్రొడక్ట్స్ లేకుండా బయటకు కూడా రాదంట మరి అవేంటో ఇప్పుడు చూద్దాం..

గతంలో ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సాయి పల్లవి.. తన మేకప్ గురించి ఆసక్తికర విషయాలను వెల్లడించింది. దానికి సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతుంది. ఆ వీడియోలో.. సాయి పల్లవి మేకప్ రూపంలో తాను ఉపయోగించే వాటి గురించి మాట్లాడుతూ.. నా బ్యాగ్‌లో ఎప్పుడూ కూడా రెండు మేకప్ వస్తువులు ఉంటాయని తెలిపింది. ఇంతకి అవేమిటంటే..ఒకటి ఐలైనర్, రెండోది మాయిశ్చరైజర్ క్రీమ్. ఈ రెండు తప్పకుండా బ్యాగ్‌లో క్యారీ చేస్తుందట. అయితే హెయిర్‌కు సంబంధించి సాయి పల్లవి ఎప్పటికప్పుడు సినిమా పాత్రను బట్టి తన హెయిర్ స్టైల్ మార్చుకుంటుంది. అలాగే ఈ అమ్మడు రాత్రిపూట షూటింగ్ చేసేటప్పుడు మాత్రమే ఐలైనర్ ఉపయోగిస్తుందట. అది కూడా కళ్ళు బాగా కనిపించడంతో పాటు.. ఆకర్షనీయంగా ఉండటానికి మాత్రమే వాడుతుందట.

కాగా సాయి పల్లవి ఎలాంటి మేకప్ లేకుండా పూర్తిగా నాచురల్‌గా గార్గి, విరాటపర్వం వంటి సినిమాల్లో నటించింది. ఈ మూవీ టైంలో మొహం కడుక్కుని తుడుచుకుని షూటింగ్‌కి వచ్చానని సాయి పల్లవి సరదాగా వ్యాక్యానించింది. ప్రస్తుతం ఈమె చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.

Advertisement

Next Story