తెరపైకి మరోసారి విడాకుల ఇష్యూ.19 ఏళ్లకే పెళ్లి చేసుకున్న సింగర్ సునీత గురించి ఇవి తెలుసా?

by Disha Web Desk 8 |
తెరపైకి మరోసారి విడాకుల ఇష్యూ.19 ఏళ్లకే పెళ్లి చేసుకున్న సింగర్ సునీత గురించి ఇవి తెలుసా?
X

దిశ, సినిమా : జీవితం అనుకున్నట్లు ఉండటం అంటే అది కష్టం అంటారు కొందరు. ఒక దాంట్లో కొన్ని కట్టు బాట్లు, రూల్స్ పెట్టుకుని సక్సెస్ అయితే, ఇంకో దాంట్లో ఫెయిల్యూర్ అనేది వస్తుంటుంది. అలాంటి వాళ్లలో సింగర్ సునీత ఒకరు. ఇండస్ట్రీలో తనకంటూ కొన్ని పరిమితులు పెట్టుకొని గాయనీగా ఎదిగిన సునీత వ్యక్తిగత జీవితంలో మాత్రం చాలా ఇబ్బందులు ఎదుర్కొన్న విషయం తెలిసిందే.

తన స్వీట్ వాయిస్‌తో ఎంతో మందిని తమ వైపుకు తిప్పుకున్న ఈమె తన వ్యక్తిగత జీవితంలో మాత్రం ఇబ్బందులు నుంచి బయటపడలేక పోయింది. 19 ఏళ్ల వయసులోనే పెళ్లి చేసుకున్న సునీత తన వైవాహిక జీవితం మాత్రం మూడునాళ్ల ముచ్చటగానే మారిపోయింది. పెళ్లి చేసుకున్న తర్వాత కొన్ని రోజులు సంతోషంగా ఉన్న ఈ జంట, తర్వాత ఇద్దరి మధ్య మనస్పర్థలు రావడం మొదలైందంట. మరీ ముఖ్యంగా సునీత, వియన్‌‌తో రిలేషన్‌లో ఉన్నట్లు ఆ మధ్య రూమర్ వచ్చింది. వీటన్నింటి నేపథ్యంలో ఆమెకు తన భర్తకు మధ్య మనస్పర్థలు పెరిగాయని, దీంతో వారు కుటుంబ సభ్యుల అంగీకారంతో విడిపోయినట్లు తెలుస్తోంది. ఇక వీరు విడిపోయే సమయానికి వీరికి ఒక పాప, బాబు ఉన్నారు. విడాకులు తీసుకున్న తర్వాత సునీత తన కొడుకు, కూతురితో ఒంటరిగానే జీవించింది. ప్రస్తుతం తన కొడుకు ఆకాశ్ హీరోగా ఎంట్రీ ఇస్తుండగా, కూతురు శ్రియా సింగర్. ఇక లాక్ డౌన్ సమయంలో సింగర్ సునీత మ్యాంగో మీడియా గ్రూప్ అధినేత రామ్ వీరపనేనిని పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే.

Read More...

విడాకుల వార్తలపై స్పందించి క్లారిటీ ఇచ్చిన రణ్‌వీర్ సింగ్.. వాటిని చూపిస్తూ ఆసక్తికర కామెంట్స్


Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !



Next Story

Most Viewed