- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్‌సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
అద్దె ఇంట్లో అడల్ట్ మూవీ షూటింగ్.. చాటుగా చూసిన ముసలమ్మ ఏం చేసిదంటే?
దిశ, సినిమా : కొన్ని సినిమాలు చూస్తే భయం వేస్తుంటుంది. మరికొన్ని సినిమాలు చూస్తే థ్రిల్లింగ్‌గా మళ్లీ మళ్లీ చూడాలని పిస్తుంది. కానీ తాజాగా ఓటీటీలో రిలీజైన సినిమా యూత్‌కు చెమటలు పట్టిస్తుంది. అడల్ట్ మూవీగా తెరకెక్కిన ఈ మూవీ హాలీవుడ్‌లో రికార్డ్స్ క్రియేట్ చేసి, సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఆ మూవీ అమెజాన్ ప్రైమ్‌లోకి వచ్చేసింది. అడల్ట్ కంటెంట్‌తో వైలెన్స్, థ్రిల్లర్ లా తెరకెక్కింది. అయితే ఈ సినిమాను మాత్రం అస్సలే చిన్న పిల్లలతో చూడకూడదంట. అంతలా ఏముంది అనుకుంటున్నారా? అయితే కథలోకి వెళ్దాం.
మియాగోత్, బ్రిటనీ ఆనా స్నో, మార్టిన్ హెండర్స్ కీలక పాత్రల్లో నటించిన మూవీ ఎక్స్(X). ఈ సినిమాను టీ వెస్ట్ దర్శకుడు తెరకెక్కించాడు. ఇందులో వృద్ధ జంట విలన్ పాత్రలో నటించి మెప్పించింది. ఇక కథలోకి వెళితే..1979లో టెక్సాస్‌లోని ఒక మారుమూల ప్రాంతంలో వరుసగా హత్యలు జరగడం అక్కడున్న వారిని భయాందోళనకు గురి చేస్తుంది. పోలీసులు సైతం ఎందుకు ఇలా జరుగుతుంది? ఎవరు చేస్తున్నారని విచారణ చేయడం మొదలు పెడతారు. అప్పుడే వారికి ఓ సమాచారం అందుతుంది. దీంతో హుటా హుటిన వారు అక్కడికి వెళ్లడంతో.. అక్కడ ఓ ఇంటిలో రక్తపు మరకలు..శవాలు కనిపించడంతో వారు షాక్ అవుతారు. దీంతో మూవీ మొదలవుతుంది.
స్టోరీలోకి వెళితే.. ఒక ఇంట్లో వృద్ధ జంట నివసిస్తూ ఉంటుంది. వారు తప్ప ఆ ఇంట్లో ఇంకెవరూ ఉండరు. అయితే అక్కడికి ఓ అడల్ట్ సినిమాను తెరకెక్కించడానికి కొందరు వచ్చి, ముసలావిడ ఉన్న ఇంట్లో ఫార్మ్ హౌజ్‌ను రెంట్‌కు తీసుకుంటారు. అయితే వారు ఆ హౌజ్‌ను షూటింగ్ కోసం తీసుకున్నట్లు ముసలావిడకు తెలియదు. ఇక ఒకరోజు వారు షూటింగ్ తీస్తున్న క్రమంలో ముసలావిడ చాటుగా చూస్తుంది. దీంతో అసలు కథ మొదలవుతుంది. ఎందుకంటే ఆమెకు కామ కోరికలు చాలా ఎక్కువ. ఇక ఈ అడల్ట్ మూవీ షూటింగ్ చూడటంతో.. ఆ కోరికలు మరింత పెరిగిపోతాయి. దీంతో ఆ కోరికలు తీర్చడానికి ఎవరైనా ఉంటే బాగుండని వెతుకుతుంటుంది. ఈ నేపథ్యంలో తన భర్త ఆమెను సంతోషపరచలేదు. దీంతో ఆమె సినిమాకు సినిమాటోగ్రాఫర్‌గా వచ్చిన యువకుడిని తన కోరిక తీర్చమని అడుగుతుంది. అతడు నిరాకరించడంతో కత్తితో పొడిచి మరీ దారుణంగా హత్య చేస్తుంది. ఆ తర్వాత ఏం జరిగింది? అనేది సినిమా. ఇక వాట్ నెక్ట్స్ అనేది మీరే చూసేయండి.