- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఈ కేబినెట్‌లో అయినా మంచి నిర్ణయాలు తీసుకోండి.. ప్రభుత్వానికి వినోద్ కుమార్ సూచన
దిశ, వెబ్‌డెస్క్: కాంగ్రెస్ ప్రభుత్వానికి కరీంనగర్ బీఆర్ఎస్ MP అభ్యర్థి బోయినపల్లి వినోద్ కుమార్ కీలక సూచనలు చేశారు. శనివారం తెలంగాణ భవన్ వేదికగా ఆయన మీడియాతో మాట్లాడారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రవేశ పెట్టిన పీఎం కిసాన్ పథకానికి స్ఫూర్తి తెలంగాణలో తాము తీసుకొచ్చిన రైతుబంధు పథకం అన్నారు. అలాంటి ప్రతిష్టాత్మక పథకాన్ని రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని మండిపడ్డారు. పంట కోతల తర్వాత రైతుబంధు ఇవ్వడం ఏంటని ప్రశ్నించారు. తక్షణమే నిధులు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఇవాళ సాయంత్రం కేబినెట్ భేటీ ఉంటుందని అంటున్నారు. ఈ కేబినెట్ సమావేశంలో అయినా మంచి నిర్ణయాలు తీసుకోవాలని సూచించారు.
ముఖ్యంగా రైతుబంధు పథకం గురించి కేబినెట్‌లో చర్చించాలి, రైతుల పట్ల సానుకూల నిర్ణయం తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రధాని నరేంద్ర మోడీతో సహా చాలామంది రైతుబంధు పథకాన్ని స్వాగతించారని గుర్తుచేశారు. రోహిణి కార్తె సమయంలో రైతులు పెట్టుబడి డబ్బుల కోసం తిరిగే పరిస్థితి ఉంటుందనీ సూచించారు. రాష్ట్రంలో ఇప్పటివరకు రైతుభరోసా అమలు కాలేదని విమర్శించారు. వెంటనే రైతుభరోసా పథకాన్ని ప్రారంభించి ఎకరానికి రూ.15 వేలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. వరి పండించిన రైతులకు రూ.500 బోనస్ ఇవ్వాలని కోరారు. కొనుగోలు కేంద్రాల్లో తడిసిన ధాన్యం రైతుల దగ్గర ఎంత ఉన్నా కొనుగోలు చేసి తీరాలని అన్నారు.