ఏంటి.. మెగాస్టార్ అల్లు అర్జున్‌తో శ్రీజ పెళ్లి చేయాలనుకున్నాడా? .. ఎట్టకేలకు బయటపడ్డ అసలు నిజాలు!

by Kavitha |
ఏంటి.. మెగాస్టార్ అల్లు అర్జున్‌తో శ్రీజ పెళ్లి చేయాలనుకున్నాడా? .. ఎట్టకేలకు బయటపడ్డ అసలు నిజాలు!
X

దిశ, సినిమా: మెగాస్టార్ చిరంజీవి చిన్న కూతురు శ్రీజ గురించి కొత్తగా పరిచయం చేయాల్సిన పని లేదు. గ్లామర్ ఫిల్మ్ లోకి రాకపోయినప్పటికీ.. పర్సనల్ లైఫ్ ద్వారా శ్రీజ ఎక్కువ పాపులర్ అయింది. 2007లో ఈ అమ్మడు ఇంట్లో నుంచి పారిపోయి మీడియా సపోర్ట్‌తో శిరీష్ భరద్వాజ్‌ను వివాహ మాడింది. అప్పట్లో చిరంజీవికి ఉన్న పేరును, మెగా ఫ్యామిలీ ఇమేజ్‌ను శ్రీజ గట్టిగానే డ్యామేజ్ చేసింది అని అనడంలో ఏమాత్రం సందేహం లేదు. అలా వివాహ బంధంలోకి అడుగుపెట్టిన శిరీష్, శ్రీజలకు ఓ పాప జన్మించింది. ఆ తర్వాత కొన్ని కారణాల వల్ల వీరిద్దరూ 2011లో విడాకులు తీసుకున్నారు. ఇక శిరీష్ నుంచి విడిపోయిన శ్రీజకు.. మళ్లీ 2016లో చిరంజీవి కల్యాణ్ దేవ్‌తో రెండో వివాహం జరిపించారు. కానీ శ్రీజ.. కళ్యాణ్ దేవ్‌తో కూడా ఒక పాపకు జన్మనిచ్చాక.. విభేదాలతో అతని నుంచి విడాకులు తీసుకుంది. ప్రస్తుతం ఇద్దరు కూతుళ్లతో శ్రీజ సింగిల్ లైఫ్‌ను లీడ్ చేస్తోంది.

ఇదిలా ఉంటే.. మెగా డాటర్ శ్రీజ అనాడు శిరీష్ కోసం ఇంట్లో నుంచి పారిపోకపోయుంటే.. నేడు ఓ స్టార్ హీరోకు వైఫ్‌గా చలామణి అవుతుండేదట. ఇంతకీ ఆ స్టార్ హీరో ఎవరంటే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌. ఏంటి నిజమా అంటే అవుననే చెప్పాలి. బేసిక్‌గా మెగా, అల్లు ఫ్యామీలీల మధ్య అనుబంధం ఎంత బాగుంటుందో మనందరికీ తెలిసిందే. మరి అలాంటి ఆ బంధాన్ని మరింత బలపరచడానికి చిరంజీవి తన చిన్న కూతురు శ్రీజను అల్లు అర్జున్‌కి ఇచ్చి వివాహం జరిపించాలని ఎంతగానో ఆశ పడ్డారట.

అంతేకాదు అల్లు అరవింద్ కూడా శ్రీజను తన ఇంటి కోడలుగా చేసుకోవాలని భావించారట. కానీ శ్రీజ చేసిన ఆ ఒక్క తప్పుతో మాత్రం సీన్ మొత్తం రివర్స్ అయిపోయింది. అలా ఆమె శిరీష్ కోసం వెళ్లిపోయి స్టార్ హీరోకు భార్య అయ్యే గోల్డెన్ ఛాన్స్‌ను మిస్ చేసుకుంది. ఇక అల్లు అర్జున్ రాజకీయ నాయుడు కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి కుమార్తె స్నేహ రెడ్డిని 2011లో లవ్ మ్యారేజ్ చేసుకున్నాడనే సంగతి తెలిసిందే. కాగా ప్రస్తుతం అల్లుఅర్జున్ సుకుమార్ దర్శకత్వంలో పుష్ప మూవీకి సీక్వేల్‌గా వస్తున్న పుష్ప 2లో నటిస్తున్నాడు.

Advertisement

Next Story

Most Viewed