‘Adipurush’ సినిమా ప్రభాస్ కోసం కాకుండా రాముడి కోసం చూడండి.. నాగబాబు కామెంట్స్ వైరల్ (వీడియో)

by Hamsa |   ( Updated:2023-06-17 06:07:52.0  )
‘Adipurush’ సినిమా ప్రభాస్ కోసం కాకుండా రాముడి కోసం చూడండి..  నాగబాబు కామెంట్స్ వైరల్ (వీడియో)
X

దిశ, వెబ్ డెస్క్: రామాయణం ఆధారంగా తెరకెక్కిన చిత్రం ‘ఆదిపురుష్’. ఇందులో రాముడి పాత్రలోప్రభాస్, సీతగా కృతి సనన్ నటించారు. ఈ సినిమాకు ఓం రౌత్ దర్శకత్వం వహించాడు. భారీ బడ్జె‌ట్‌తో జూన్ 16న ‘ఆదిపురుష్’ గ్రాండ్‌గా విడుదలైంది. అది చూసిన ప్రేక్షకులు మాత్రం పలు రకాలుగా స్పందిస్తూ మోడ్రనైజ్‌గా రాముడిని చూపించి రామాయణం మార్చేసి చూపించారని డైరెక్టర్‌ను ట్రోల్ చేస్తున్నారు.

తాజాగా, ఈ సినిమాపై మెగా హీరో నాగబాబు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ వీడియోను తన ట్విట్టర్‌లో షేర్ చేశారు. ఆదిపురుష్’ సినిమా ట్రైలర్ ను చూశాను. చాలా బాగుంది తప్పకుండా సినిమా చూస్తాను. ఒక నిజమైన మనిషి ఎలా ఉండాలో నిరూపించిన వ్యక్తి శ్రీరాముడే. రామాయణం, మహాభారతం లాంటి అద్భుతమైన గ్రంథాలు ప్రపంచంలో ఎక్కడా ఉండదు. మహాభారతం జరిగి ఉంటే అద్భుతం జరగకపోతే మహాద్భుతం అని ఎవరో అన్నట్టు రామాయణం కూడా అలాంటి మహా గ్రంథమే. సమాజంలో ఒక మనిషి ఎలా నడుచుకోవాలి అనేది రాముడు చెప్తే, ధర్మంగా ఎలా బతకాలో శ్రీకృష్ణుడు చెప్పాడు. అందుకే యువత రామాయణ, మహాభారతాల గురించి తెలుసుకోవాలి. నాకెంతో ఇష్టమైన పాత్ర శ్రీరాముడు. రామాయణం ఆధారంగా సినిమా వస్తుంది అంటే హీరో ప్రభాస్ అనో లేదా వేరే వాళ్లనో మాటలు చెప్పడం లేదు. ఎవరి కోసమో ఈ మాటలు చెప్పడం లేదు, మన హిందూ దేశంలో రామాయణం అనే గొప్ప గ్రంథం ఉందని తెలుసుకోవడం కోసం ఈ సినిమాను అందరూ చూడాలి. రాముడిలా ఒక్క క్షణం అయినా మనం బతకగలమా అని అప్పుడప్పుడు అనిపిస్తుంది. రాముడు గొప్ప యోధుడు, గొప్ప రాజు, గొప్ప కొడుకు, గొప్ప అన్న, గొప్ప భర్త అన్నిటికన్నా గొప్ప మనిషి. నేనెప్పుడూ ఏ సినిమా గురించి కూడా చెప్పను. కానీ ఈ ‘ఆదిపురుష్’ పేరుతో వచ్చిన రామాయణం సినిమా కచ్చితంగా చూడాలి. ఇది హిందువులకు గౌరవప్రదమైన గొప్ప కథ, గాథ అని చెప్పుకొచ్చారు నాగబాబు. ప్రస్తుతం ఆయన చేసిన కామెంట్స్ వైరల్‌గా మారాయి.

Also Read: ట్రెండింగ్‌లో #om raut.. ప్రభాస్ ‘ఆదిపురుష్’ బాయ్‌కాట్ చేయాలంటూ ట్వీట్స్..

Advertisement

Next Story