‘టైగర్ నాగేశ్వరావు’ మూవీ ఫస్ట్ ఛాయిస్ రవితేజ కాదా!

by Hamsa |   ( Updated:2023-10-21 09:42:59.0  )
‘టైగర్ నాగేశ్వరావు’ మూవీ ఫస్ట్ ఛాయిస్ రవితేజ కాదా!
X

దిశ, సినిమా: టాలీవుడ్ హీరో రవితేజ నటించిన ‘టైగర్ నాగేశ్వరరావు’ సినిమా అక్టోబర్ 20న ప్రేక్షకుల ముందుకొచ్చింది. సరికొత్త పాత్రలో రవితేజ అదరగొట్టేశాడు. అలాగే నుపూర్, గాయత్రి అందంతోపాటు నటనతోనూ ఆకట్టుకున్నారు. అనుపమ్ ఖేర్, రేణు దేశాయ్ పాత్ర కూడా బాగుంది. ఫైనల్‌గా చెప్పాలంటే కథ ప్రకారం రవితేజ అభిమానులకు పండుగ లాంటి సినిమా. ఇదిలావుంటే.. మొదట ఈ సినిమా ఆఫర్ బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌కు ఇచ్చారట డైరెక్టర్. అతను రిజెక్ట్ చేయడంతో చిరంజీవిని ట్రై చేద్దామనుకున్నాడట. అది కూడా వర్కౌట్ కాకపోవడంతో చివరగా రవితేజతో చేశారట.

Advertisement

Next Story