స్టార్ హీరోతో సినిమా చేద్దామనుకున్నారు.. Mr. Pregnantపై Sohel ఎమోషనల్ కామెంట్స్

by Anjali |   ( Updated:2023-08-19 03:46:39.0  )
స్టార్ హీరోతో సినిమా చేద్దామనుకున్నారు.. Mr. Pregnantపై Sohel ఎమోషనల్ కామెంట్స్
X

దిశ, వెబ్‌డెస్క్: ‘బిగ్‌బాస్’ సోహైల్ నటించిన ‘మిస్టర్ ప్రెగ్నెంట్’ నిన్న (ఆగస్టు 18)థియేటర్లలో గ్రాండ్ రిలీజ్ అయ్యింది. తాజాగా సోహైల్ ఈ మూవీ గురించి ఆసక్తికర కామెంట్లు చేశాడు. ‘‘ డైరెక్టర్ శ్రీనివాస్ నాకు ఎనిమిదేళ్లుగా పరిచయం. మేము ఇద్దరం మంచి ఫ్రెండ్స్. ఫస్ట్ ఈ సినిమా పెద్ద హీరోతో చేయాలని అనుకున్నాడు. ఎందుకంటే మేమిద్దరం అంతగా ఫేమ్ కాదు. అలాంటప్పుడు మేము చేస్తే సినిమా వర్కౌట్ అవ్వదు అన్నాడు. నాకు ఫలానా హీరో మేనేజర్ తెలుసు కదా.. రిఫర్ చేయొచ్చు కదా అనేవాడు. నాకు కోపం వచ్చేది. నన్ను పెట్టుకుని ఎందుకు వేరే హీరోని అడుగుతున్నాడు అని. ఎందుకంటే ఇందులో మేల్ ప్రెగ్నెంట్‌గా నటించడం అనేది చాలా ఢిపరేంట్ స్టోరీ కాబట్టి నాకు ఈ కథ బాగా నచ్చింది. అందుకే ఈ మూవీలో నేనే నటిస్తానని చెప్పాను.

నేను హీరోగా చేసినంత మాత్రాన జనాలు థియేటర్‌‌‌‌కు ఎందుకు వస్తారని స్టార్టింగ్ నుంచి అనుకునేవాడిని. కమర్షియల్ సినిమాలు చేయడానికి ప్రముఖ హీరోలు ఉన్నారు. లవ్ స్టోరీస్ చేయడానికి నాని, విజయ్ దేవరకొండ వంటి వారు ఉన్నారు. నేను కూడా వాళ్ల మాదిరి సినిమాలు చేస్తే జనాలు ఎందుకు థియేటర్‌కు వస్తారని కొత్తగా ఆలోచించాను. అందుకే ఈ చిత్రాన్ని ఎంపిక చేసుకున్నాను. వాస్తవానికి డైరెక్టర్ నాకు వేరే కథ చెప్పాడు. కానీ అందులో అంత ఎమోషనల్ కంటెంట్ ఉంది కాబట్టి ఇదే మూవీ చేస్తానని పట్టుబట్టాను.’ అంటూ సోహైల్ చెప్పుకొచ్చాడు.

Also Read: Vijayతో Samantha హాట్ పర్ఫామెన్స్‌కు.. ఆమెను రంగంలోకి దింపి ధీటైన జవాబు ఇచ్చిన Naga Chaitanya..!

Advertisement

Next Story

Most Viewed