Kangana Ranautను చెంపదెబ్బలు కొట్టాలని ఉంది: షాకింగ్ కామెంట్స్ చేసిన నటి

by Prasanna |   ( Updated:2023-09-08 06:09:12.0  )
Kangana Ranautను చెంపదెబ్బలు కొట్టాలని ఉంది: షాకింగ్ కామెంట్స్ చేసిన  నటి
X

దిశ,వెబ్ డెస్క్: బాలీవుడ్‌ ఫైర్‌ బ్రాండ్‌ కంగనా రనౌత్‌పై పాక్‌ నటి నౌషీన్‌ షా ఆగ్రహం వ్యక్తం చేసింది. అసలు ఏమి జరిగిందంటే..'మోమిన్ సాకిబ్‌తో హద్ కర్ ది షో'లో పాల్గొన్న నౌషీన్‌ను బాలీవుడ్ తారలను ఎవరినైనా కలవాలనుకుంటున్నారా? అని ప్రశ్నించగా.. కంగనా పేరు చెప్పి.. ఆమెను చెంపదెబ్బలు కొట్టాలనుకుంటున్నట్లు ఆమె చెప్పుకొచ్చింది. పాక్‌ గురించి ఇష్టమొచ్చినట్టు మాట్లాడుతుంది, వ్యక్తుల అంటే గౌరవం లేదు, ఎప్పుడు ఎవరితో వివాదాలు పెట్టుకుందామా అంటూ ఉంటుందని కీలక వ్యాఖ్యలు చేసింది. కంగనాకు జ్ఞానం లేదు, ఎలా మాట్లాడాలో కూడా తెలీదు, ఆమె తన మాజీ బాయ్‌ఫ్రెండ్స్‌ పై దృష్టి పెడితే మంచిదంటూ సూచించింది. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్‌గా మారాయి. అయితే, కంగనా అభిమానులు నౌషీన్‌పై మండిపడుతున్నారు.

Read More: అమెరికా నుంచి Samantha సడెన్‌గా హైదరాబాద్ కు వచ్చేసింది.. ఎందుకో తెలుసా..?

Advertisement

Next Story