Guppedantha Manasu August 14 Episode : రిషి, వసుధారను కలిపిన విశ్వనాధం

by Prasanna |   ( Updated:2023-08-14 09:25:57.0  )
Guppedantha Manasu August 14 Episode : రిషి, వసుధారను కలిపిన విశ్వనాధం
X

దిశ,వెబ్ డెస్క్: గుప్పెడంత మనస్సు ఈ రోజు ఎపిసోడ్ లో

‘విశ్వం ఇంక ఆపుతావా.. ఇక ఈ విషయం ఇక్కడితో వదిలెయ్’ అని ఏంజెల్ కోపంగా అంటుంది. ‘అమ్మా నా మాట విను ఒకసారి.. ఇప్పటి వరకు నేను నిన్ను ఏం అడగలేదు.. ఇది నా కోరికమ్మా.. నెరవేర్చమ్మా.. అమ్మా నన్ను ఒక సంబంధం చూడమంటావా? నీకు అన్ని విధాలా సరిపోయేలా అబ్బాయినే చూస్తాను..అంటూ విశ్వనాధం. దాంతో ఏంజెల్ అక్కడి నుంచి కోపంగా వెళ్లిపోతుంది. ‘చూశారా మీరు.. తను పెళ్లికి ఒప్పుకుంటుందో లేదో? పెళ్లి చేసుకోకపోతే తన జీవితం ఎలా ఉంటుందో అని నాకు చాలా భయంగా ఉంది.. అంటూనే.. ‘అమ్మా రిషి.. వసుధార ఇలా రండి’ అని వారిని పిలిచి వసు, రిషీల చేతుల్ని కలిపి పట్టుకుని.. చాలా ఎమోషనల్‌గా మాట్లాడుతాడు.. . ‘మా ఏంజెల్ జీవితాన్ని మీ చేతిలో పెడుతున్నా' తనని ఎలా అయినా మీరే మార్చాలని చెబుతాడు. అప్పుడు ‘అలాగే సార్’ అంటాడు రిషి. విశ్వానాధం రెండు చేతుల్ని వదిలిపెట్టగానే.. రిషి వెంటనే తన చేతిని వెనక్కి లాక్కొంటాడు.. వసు అప్పుడు చాలా ఫీల్ అవుతుంది.

Advertisement

Next Story