జాతిరత్నాలు డైరెక్టర్ అనుదీప్ తో విశ్వక్ సేన్ మూవీ?

by Prasanna |
జాతిరత్నాలు డైరెక్టర్ అనుదీప్ తో విశ్వక్ సేన్ మూవీ?
X

దిశ, సినిమా: హీరో విశ్వక్ సేన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మూవీ హిట్ అయినా.. ఫ్లాప్ అయినా ఒకే రకమైన ఆటిట్యూడ్ మైంటైన్ చేస్తూ ఉండేవారిలో విశ్వక్ కూడా ఒకరు. చూడటానికి కోపకారిలాగా కనిపిస్తాడు. కానీ, తనకి ఒకసారి పరిచయమైతే తీసుకెళ్లి పెంచేసుకుంటారంటూ తను చెప్పిన డైలాగ్స్ అప్పట్లో బాగా వైరల్ అయ్యాయి.

ఫలక్ నామా దాస్ లాంటి మాస్ మూవీతో హీరోగా ఎంట్రీ ఇచ్చి.. మాస్ హిట్ కొట్టి మంచి పేరును తెచ్చుకున్నాడు. ఎప్పటికప్పుడు కొత్త కథలతో తనదైన స్టైల్ లో అందర్ని అలరిస్తున్నాడు విశ్వక్ సేన్. రీసెంట్ గా రిలీజ్ అయినా గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి అనే మాస్ సినిమాతో మన ముందుకొచ్చాడు. ఈ మూవీకి పాజిటివ్ రావడంతో మంచి కలెక్షన్స్ వసూలు చేసింది. ఇక ఇప్పుడు ఓటీటీలో కూడా స్ట్రీమ్ అవుతుంది. ఇదిలా ఉంటే ఇప్పుడు విశ్వక్ వరుస సినిమాలతో బిజీ అయ్యాడు. అయితే, తాజాగా విశ్వక్ సేన్ గురించి ఓ వార్త నెట్టింట హల చల్ చేస్తుంది.

జాతిరత్నాలు వంటి సూపర్ హిట్ సినిమా తర్వాత అనుదీప్ ప్రిన్స్ మూవీ తీసాడు, ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. ఇప్పటివరకు అనుదీప్ కొత్త సినిమా ఏదీ ప్రకటించలేదు. కల్కి సినిమాలో అలా మెరిసి ఇలా వెళ్ళిపోయాడు. ఇప్పుడు విశ్వక్, అనుదీప్ కలసి ఓ సినిమా చేయనున్నట్టు వార్తలు వస్తున్నాయి. వీరిద్దరూ కలిస్తే పెద్ద హిట్ మూవీ వస్తుందని అంటున్నారు. మరి వీరిద్దరూ కలిసి ఎలాంటి సినిమా చేస్తారో చూడాలి.

Next Story

Most Viewed