- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
సినిమాలోనే ఆయనకు భార్యను.. నిజజీవితంలో కాదు : అభినయ
దిశ, సినిమా : కోలీవుడ్ స్టార్ హీరో విశాల్ పెళ్లి వ్యవహారం మరోసారి హాట్ టాపిక్‌గా మారింది. గతంలో వరలక్ష్మీ శరత్ కుమార్‌తో ప్రేమ వ్యవహారంపై నడుస్తోందని కోడై కూసిన సోషల్ మీడియా.. తాజాగా ప్రముఖ హీరోయిన్ అభినయతో విశాల్ ప్రేమలో ఉన్నాడంటోంది. అంతేకాదు వీరిద్దరూ త్వరలోనే పెళ్లి కూడా చేసుకోబోతున్నారంటూ నెటిజన్లు బలంగా వాదిస్తున్నారు.
ఇదిలా ఉంటే, పలు తెలుగు సినిమాల్లో సపోర్టింగ్ క్యారెక్టర్స్‌తో మెప్పించిన అభినయ.. ప్రస్తుతం విశాల్ హీరోగా నటిస్తున్న 'మార్క్ ఆంటోనీ' చిత్రంలో లీడ్ రోల్ పోషిస్తోంది. ఈ నేపథ్యంలో విశాల్‌తో ప్రేమ, పెళ్లిపై పుకార్లు గుప్పుమన్నాయి. అయితే ఈ ఇష్యూపై ఇప్పటి వరకు ఎవరూ స్పందించకపోగా.. సినిమాలో తన క్యారెక్టర్ గురించి మాత్రం అభినయ రీసెంట్ ఇంటర్వ్యూలో రివీల్ చేసింది. 'మార్క్ ఆంటోనీ' చిత్రంలో విశాల్‌కు భార్యగా నటిస్తున్నానన్న ఆమె.. రీల్ లైఫ్‌లో అలా నటించినంత మాత్రాన రియల్ లైఫ్‌లో భార్య కాగలమా? అంటూ నెటిజన్లపై ఆగ్రహం వ్యక్తం చేసింది.