ఆమె అంతే.. నయనతారపై షాకింగ్ కామెంట్స్ చేసిన Vishal

by sudharani |   ( Updated:2023-07-29 03:59:23.0  )
ఆమె అంతే.. నయనతారపై షాకింగ్ కామెంట్స్ చేసిన Vishal
X

దిశ, వెబ్‌డెస్క్: విశాల్ హీరోగా, ప్రీతివర్మ జంటగా వస్తున్న సినిమా ‘మార్క్ ఆంటోని’. ఆధిక్ రవిచంద్రన్ దర్శకత్వం వహించిన ఈ మూవీలో దర్శకుడు సెల్వరాఘవన్ ముఖ్య పాత్రలో కనిపించనున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం ప్రమోషన్స్‌లో బిజీగా ఉంది. ఈ క్రమంలోనే వరుస ఇంటర్వ్యూలో పాల్గొంటున్న విశాల్ నయనతార గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

నయనతార ప్రమోషన్స్ లో పాల్గొనకపోవడానికి కారణం ఏంటని విలేకరి ప్రశ్నకు విశాల్ మాట్లాడుతూ.. ‘‘నయనతార ఏ సినిమా ప్రమోషన్స్‌లో పాల్గొనరు. అది ఆమె వ్యక్తిగత హక్కు. కచ్చితంగా పాల్గొనాలని ఆమెను బలవంతం చేయలేరు కదా’’ అంటూ చెప్పుకొచ్చారు. విశాల్ వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

Also Read: ఆ స్టార్ హీరోయిన్ పెళ్లి చేసుకుంటే కచ్చితంగా పెటాకులే.. Venu Swamy సంచలన వ్యాఖ్యలు

Advertisement

Next Story