చెల్లెలి కోసం నైట్ డ్యూటీ చేస్తున్న అన్నయ్య.. ఉపాసన పోస్ట్ వైరల్

by Nagaya |   ( Updated:2023-07-17 14:28:05.0  )
చెల్లెలి కోసం నైట్ డ్యూటీ చేస్తున్న అన్నయ్య.. ఉపాసన పోస్ట్ వైరల్
X

దిశ, సినిమా: రామ్ చరణ్, ఉపాసన దంపతులు పెళ్లయిన పదేళ్లకు తల్లిదండ్రులయ్యారు. జూన్ 20న ఉపాసన పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. రీసెంట్‌గా సాంప్రదాయబద్ధంగా మెగా వారసురాలికి ‘క్లింకారా’ అని నామకరణం కూడా చేశారు. ఉపాసనకు మూగజీవాలు అంటే ఎంతో ఇష్టం. అప్పుడప్పుడు వాటితో కాసేపు సమయాన్ని గడుపుతుంటుంది. తన పెట్‌ డాగ్‌ రైమ్‌‌ను ఎంతో ప్రేమగా చూసుకుంటుంది. ఇది పూడుల్ జాతికి చెందిన కుక్క. ఒంటి నిండా పట్టులాంటి బొచ్చుతో ముద్దు‌గా ఉంటుంది. అయితే తాజాగా ఉపాసన తన ఇన్‌స్టా‌లో ఓ పిక్ షేర్ చేసింది. అందులో ఈ రైమ్‌, చరణ్ గారాలపట్టి ఊయ్యలలో పడుకుని ఉంటే కుర్చీ పైకిఎక్కి చూస్తుంది. ‘నా చెల్లెలు మీద ఓ కన్నేసి ఉంచాను. నైట్ డ్యూటీ. ఎల్లప్పుడూ రైమ్ ఇలానే ఉండాలి’ అంటూ రాసుకొచ్చింది ఉపాసన. ఈ పిక్ ప్రస్తుతం వైరల్ అవుతుంది.

Read More: భర్తలకు టార్చర్ చూపించిన మెగా డాటర్స్.. అందుకే విడాకులు ఇచ్చారట

చరణ్ కూతురు కోసం తారక్ పిల్లలు ఏం చేశారో తెలుసా?

Advertisement

Next Story